తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని ఓ ఎంపీ ఆరోపించడం అప్పట్లో సంచలనమైంది. ఆయన కాలి మీద కమిలిన గాయాలతో ఉన్న ఫొటోలు కూడా బయటకు వచ్చి వైరల్ గా మారాయి. ఇప్పటికే అర్థం అయి ఉంటుంది అప్పటి ఎంపీ ఎవరో..  రఘురామ కృష్ణం రాజు..


ముఖ్యమంత్రిని విమర్శిస్తూ రాజద్రోహానికి పాల్పడ్డారంటూ, సమాజంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ రఘురామపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత గుంటూరు తీసుకువచ్చి విచారించారు. ఈ సమయంలో ఆయన పోలీసులు రబ్బరు బెల్టు, లాఠీలతో కొట్టడంతో పాటు గుండె ఆపరేషన్ అయిన తన ఛాతిపై కూర్చొని చంపేందుకు యత్నించారు అని తీవ్ర ఆరోపణలు చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం కావడంతో ఏమీ కాలేదు. కానీ ఇప్పుడు పార్టీ మారారు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. పార్టీ అధికారంలో ఉంది. దీంతో మాజీ సీఎం జగన్ తో పాటు పలువురిపై ఆయన కేసు పెట్టారు.


2021లో తనను హింసించి హత్యాయత్నం చేశారని ఆరోపిస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నాటి సీబీసీఐడీ డీజీ పీవీ సునీల్ కుమార్, ఇంటెలిజన్స్ చీఫ్ రామాంజనేయులు, వైఎస్ జగన్, సీబీసీఐడీ అదనపు ఎస్పీ ఆర్ విజయ్ పాల్, గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చెందిన డాక్టర్ ప్రభావతి లను నిందితులుగా చేర్చారు. అయితే రఘురామ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


ఒకవేళ కొట్టినట్లు ఆధారాలు ఉంటే.. ఎటువంటి సమస్యా ఉండదు. డీజీ ర్యాంకుకు చెందిన సునీల్ కు అంతే ఆప్షన్ ఉంటుంది. రఘురామ రాజు కేవలం విజయపాల్, సునీల్ ను టార్గెట్ చేస్తున్నారు. వీరిద్దరూ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారే. అంటే వీరిపై ఆరోపణలకు పక్కాగా సాక్ష్యాలు ఉండాలి. ఇందులో కూడా ఫర్ ఫెక్ట్ ఎవిడెన్స్, ప్లాంటెడ్ ఎవిడెన్స్ రెండు రకాలు ఉన్నాయి. ఆయన తన గాయాలపై తప్పుడు నివేదిక ఇచ్చారని కూడా ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఎస్సీ, ఎస్టీ కింద తప్పుడు సాక్ష్యం చెబితే.. అలా చెప్పిన వారికి జైలు శిక్ష పడుతుంది. మరి ఈ కేసులో ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: