ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటిపై చంద్రబాబు వరుసగా శ్వేత పత్రాలు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అసెంబ్లీ లో ఏపీలోని శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా గతంలో హైదరాబాద్ ఎలా ఉండేది.. తాను ఎలా మార్చిందీ చంద్రబాబు చెప్పుకొచ్చారు.


అవును.. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో పరిస్థితి ఎలా ఉంది అనే విషయాలను ప్రజలకు వివరించే ప్రయత్నాల్లో భాంగా చంద్రబాబు సర్కారు వరుసగా శ్వేత పత్రాలను విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా స్పందించిన.. ఆయన గత ప్రభుత్వ పాలనలో ప్రసలు మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించారని అన్నారు. ఇదే క్రమంలో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలు పోలీలసులు అండతో ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని విమర్శించారు.  దీంతో పాటు హైదరాబాద్ లో మత ఘర్షణలు లేకుండా చేశానని ప్రకటించుకున్నారు.


అయితే ఇంకా ఎంత కాలం హైదరాబాద్ గురించే చెప్పుకొంటూ కాలం గడుపుతారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇప్పుడు అది పూర్తిగా తెలంగాణ రాష్ట్ర రాజధాని అని.. ఇప్పుడు అమరావతి గురించి చూడండి చెప్పండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 400 ఏళ్ల చరిత్ర ఉందని.. అందులో చాలామంది పాత్ర ఉందని గుర్తు చేస్తున్నారు.


ఇదే సమయంలో.. ఏపీలో శాంతి భద్రతలు గురించి వివరిస్తూ.. చంద్రబాబు మరో విచిత్రమైన పోలిక తీసుకువచ్చారు. నా హయాంలో తక్కువ నేరాలు జరిగాయి అని.. చంద్రబాబు పాలన లెక్కలే చెబుతున్నారు తప్ప 2019-24 వైసీపీ తో పోల్చడం లేదు.  ఆ లెక్కల వివరాలను బయట పెట్టడం లేదు. నేర రహిత రాజ్యం కోసం కృషి చేసి.. అభివృద్ధిలో పోలికను చూడాలి కానీ.. నా హయాంలో తక్కువ నేరాలు జరిగాయి అంటే.. అసలు జరగకుండా చూడటమే కదా నాయకులు బాధ్యత అని పలువురు గుర్తు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: