గతంలో వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సమయంలోను ఏపీలో శాంతి భద్రతలు బాగా లేవంటూ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే పని చేశారు. దీంతో పాటు అదనంగా ఆయన శ్వేత పత్రం కూడా విడుదల చేశారు. ఇక ఎవరి మీడియా వారికుంది. ఈ రోజుల్లో జరిగిన సంఘటనల విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. గత ఐదేళ్లలో అరాచకాలు జరిగాయి అని జనం నమ్మారు కాబట్టే వైసీపీని ప్రజలు ఇంటికి పంపించారు.
ఎన్నో సంక్షేమ పథకాలు అందించినా 11 సీట్లకే పరిమితం చేశారు. ఇప్పుడు టీడీపీ హయాంలో కూడా అలాంటి పరిస్థితులే చోటు చేసుకుంటున్నాయి. ప్రతీ కార దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా సత్తెనపల్లిలో వైసీపీ కౌన్సిలర్ కారుని కొంతమంది దగ్ధం చేశారు. వైసీపీకి చెందిన నేతల వెంచర్లు, కట్టడాలు కూల్చి వేస్తున్నారు. ఇది అంతా ఒక ఎత్తు అయితే..
ఇప్పుడు ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తున్న వారిపై కూడా టీడీపీ నేతలు తమ అధికారాన్ని చెలాయిస్తున్నారు. కంపెనీల్లో పనిచేసే కార్మికులు కూడా తమ పార్టీ వారే ఉండాలని టీడీపీ నేతలు పట్టుబడుతున్నాంట. శ్రీకాకుళం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లాలో జరిగిన ఘటనలే దీనికి నిదర్శనం. వైసీపీ ఓటమి పాలైన 40 శాతం ఓటు బ్యాంకు ఉందనేది వాస్తవం. జగన్ సంక్షేమ పథకాల అమల్లో పక్షపాత ధోరణి చూపించలేదు. అందరికీ అన్ని పథకాలు అమలు చేశారు. నగదు బదిలీ చేశారు. కానీ టీడీపీ నేతలు మా పార్టీ కార్యకర్తలే ఉండాలి అని రచ్చచేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. వీటిని చంద్రబాబు కంట్రోల్ చేయలేకపోతే 2029 లో ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. గతంలో ఇలా ద్వితీయ, క్షేత్ర స్థాయిలో నాయకుల్ని అదుపులోకి తీసుకురావడంలో జగన్ ఫెయిల్ అయ్యారు. ఫలితాన్ని అనుభవించారు.