రాజ్యాంగాన్ని మొదట రూపొందించినప్పుడు పీఠిక లో సెక్యూలర్ అనే పదం లేదు. సెక్యూలర్, సోషలిస్టు అనే పదాలను 1976లో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగాన్ని సవరించి మరీ సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను చేర్చింది నాటి ప్రధాని ఇందిరా గాంధీ. రాజ్యాంగాన్ని 42వ సవరణ ద్వారా ఇదిర చేర్చిన దానిని మొదటి ఉంచి మన రాజ్యాంగంలో ఉన్నట్లు భ్రమింపజేయడంలో రాజకీయ నాయకులు, మీడియా కూడా కలిసి విజయం సాధించాయి.


తాజాగా అవనీ డయస్ అనే ఆస్ట్రేలియా జర్నలిస్ట్ ను ఇండియా నుంచి బహిష్కరించారు అమిత్ షా. అవనీయ డాస్ తన డాక్యుమెంటరీలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలు రాజ్యాంగం రూపొందించినప్పటి నుంచి ఉన్నాయని చెప్పింది. సెక్యులర్, సోషలిస్ట్ దేశం అయిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ సెక్యులర్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అంటూ తన డాక్యుమెంటరీ వీడియోలో పేర్కొంది. దీని మీద అమిత్ షా వెంటనే స్పందించి భారత్ లో అవనీ డియాస్ తన జర్నలిస్టు కార్యకలాపాలను నిషేదిస్తూ భారత్ లో కి రావడానికి వీల్లేదని ఉత్తర్వులు జారీ చేశారు.


ఏబీసీ న్యూస్ అనేది అమెరికన్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్. ఏబీసీ న్యూస్ కి ఆస్ర్టేలియా లో పనిచేస్తోంది అనవీ డయాస్. రెండు నెలల క్రితం కూడా ఫ్రాన్స్ కి చెందిన జర్నలిస్ట్ భారత్ వ్యతిరేక వార్తలు రిపోర్టు చేస్తున్నాడని తెలిసి అతడిని ఆ దేశానికి తిప్పి పంపారు.


ఇక్కడితో అయిపోలేదు ఈ విషయం. భారత హోం మంత్రిత్వ శాఖ ఏబీసీ న్యూస్ ఛానల్ కి నోటీసులు ఇచ్చి వివరణ కూడా పంపమని చెప్పింది. దీనిపై వివరణ  ఇచ్చిన సదరు వార్తా సంస్థ.. భారత్ రాజ్యాంగంలో సోషలిస్ట్, సెక్యూలర్ అనే పదాలు 1976లో ఎమర్జెన్సీ సమయంలో బలవంతంగా చొప్పించారని.. అవనీ డయాస్ తన డాక్యుమెంటరీలో తప్పుడు సమాచారం ఇచ్చారని.. ఆమెను ఛానల్ నుంచి తొలగిస్తామని ప్రకటించింది. అంటే మోదీ 3.0లో కూడా మునిపటి వలే కఠినంగా వ్యవహరిస్తున్నారని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: