జమ్మూ కశ్మీర్ కి స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత లోయలో ప్రశాంత వాతావరణం కనిపించింది. దీంతో భారతీయులు స్వేచ్ఛగా కశ్మీర్ కు రాకపోకలు సాగించారు. మరోవైపు విదేశీ పెట్టుబడులు కశ్మీర్ కు వస్తున్నాయి. అయితే రెండేళ్లుగా అక్కడ మళ్లీ ఉగ్ర కదలికలు పెరిగాయి. ఈ కాలంలో దాదాపు 48 మంది సైనికులు వీర మరణం పొందారు. ఇదిలా ఉంటే..


తాజాగా లోక్ సభ ఎన్నికల తర్వాత, త్వరలో కశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో కశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు. లోయలో అశాంతి, అభద్రతను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల ఏరివేతకు భారత ఆర్మీ సిద్ధం అయింది. సర్ప్ వినాశ్ 2.0 పేరుతో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాలని నిర్ణయించింది. దీనిని నేరుగా ప్రధానమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది.


కశ్మీర్ లో త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్రం తెలిపింది. ఈ మేరకు సుప్రీం కోర్టులో అఫడవిట్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదుల కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎన్నికలను అడ్డుకోవడమే లక్ష్యంగా పాక్, చైనా లతో పాటు కశ్మీర్ లోని కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వలాభం కోసం కుట్ర పన్నుతున్నాయి.  


భారత్ లో అస్థిరతే సృష్టించడమే లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను పెంచుతున్నారు. 2014, 2019 లోకేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఇక 2024లో సంకీర్ణం కొలువు దీరింది. వరుస దాడులతో కశ్మీర్ లో అశాంతి సృష్టించడం ద్వారా ప్రభుత్వం అస్థిర పడుతుందని వీరు భావిస్తున్నారు. ఈ క్రమంలో సైనికులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు.


ప్రజల జోలికి వెళ్లడం లేదు. వీరి నుంచి వ్యతిరేకత వస్తే తాము స్థానికంగా ఉండలేమన్న భావనతో పోలీసులు, సైన్యమే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత సైలెంట్ అయిన ఉగ్రవాదులు ఈ ఏడాది జనవరి నుంచి దాడులు పెంచారు. అయితే మోదీ నేతృత్వంలోని కేంద్రం ఉగ్రవాదాన్ని ఉపేక్షించేదే లేదని, సర్ప్ వినాశ్ 2.0 పేరుతో చేపట్టిన ఆపరేషన్ లో 55 మంది ఉగ్రవాదులన్ని హతమార్చడమే లక్ష్యంగా ఆర్మీ పనిచేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: