దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లోక్ సభ ఫలితాలు పూర్తై ఫలితాలు వెలవడి ప్రభుత్వాల ఏర్పాటు కూడా పూర్తైనా దీనిపై అనుమానాలు మాత్రం ఇంకా తొలిగిపోలేదు. ఏడు దశల్లో సాగిన ఈ పోలింగ్ పూర్తి కాగానే దశల వారీగా ఓట్ల శాతాన్ని వెల్లడించేందుకు ఈసీ నిరాకరిచండంతో అనుమానాలు మొదలయ్యాయి.ఇవి కాస్తా చినికి చినికి గాలివానలా మారి సుప్రీం కోర్టు వరకు వెళ్లాయి. అయితే దీనిపై తదుపరి విచరణకు సర్వోన్నత న్యాయ స్థానం విచారణకు సిద్ధం లేకపోవడంతో అప్పటికే సద్దుమణిగింది.


కానీ ఓట్ల శాతాన్ని వెల్లడించాలని సుప్రీం కోర్టు వరకు వెళ్లిన స్వచ్ఛంద సంస్థ అసోసియేషన్ ఫర్ డెమెక్రటిక్ రిఫార్స్మ్ (ఏడీఆర్) మాత్రం దీనిని వదిలిపెట్టలేదు. ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని, కౌంటింగ్ చేసిన ఓట్ల శాతాన్ని పోలుస్తూ డేటా విడుదల చేసింది. దీని ప్రకారం పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు దాదాపు 6 లక్షలకు పైగా తేడా ఉందని తేల్చింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం సుప్రీం విచారణకు మరోసారి రానుంది.


దేశంలోని 362 నియోజకవర్గాల్లో ఈవీఎంలలో నమోదు చేసిన ఓట్లలో చాలా వరకు లెక్కించలేదని ఏడీఆర్ ఆరోపిస్తోంది. దీంతో పోలింగ్, కౌంటింగ్ మధ్య ఓట్ల వ్యత్యాసం 5.5 లక్షలకు పైగా ఉంటుందని చెబుతోంది. 176 సీట్లలో ఈవీఎంల ద్వారా నమోదైన ఓట్ల కంటే దాదాపు 35 వేల ఓట్లు ఎక్కువగా వచ్చినట్లు ఏడీఆర్ పేర్కొంది.


పోలైన లెక్కించిన ఓట్ల మధ్య వ్యత్యాసం మొత్తం దేశంలో ఏపీలోనే అత్యధికంగా ఉంది. ఏపీలో 21 నియోజకవర్గాల్లో కలిపి మొత్తం పోలైన ఓట్ల కంటే 85777 ఓట్లను తక్కువగా లెక్కించారు. అలాగే మరో నాలుగు నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే 3722 ఓట్లను అధికంగా లెక్కించారు. ఇది అనుమానాలకు తావిస్తోంది.


అయితే 2019 ఎన్నికల్లోను ఇదే జరిగిందని ఏడీఆర్ వ్యవస్థాపకుడు జగదీప్ చోకర్ తాజాగా ఎన్టీటీవీకి తెలిపారు. పోలైన ఓట్లకు, లెక్కించిన సంఖ్యంకు వ్యత్యాసం ఉందని ఎన్నికల సంఘం సొంతం గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. ఈ తేడా ఎందకు వచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: