మధ్య తరగతి ప్రజల్లో ఆదాయం పెరగడం, విదేశాల్లో అధిక జీతాలందించే ఉపాధి అవకాశాలు ఉండటంతో ఈ పదేళ్లలో వీరి సంఖ్య రెట్టింపైంది. అదే సమయంలో విదేశాల నుంచి మన దేశంలో చదువుకునేందుకు వచ్చే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అయితే భారతీయ విద్యార్థులు ఎక్కువగా తరలి పోవడం, వారి ఆదాయ, వ్యయాలు అన్నీ ఇతర దేశాల్లోనే జరుగుతుండటంతో దేశీయ కరెంట్ అకౌంట్ పై ప్రభావాన్ని చూపుతోంది.


విదేశాల్లో చదువుతూ.. అక్కడే పని చేసుకుంటున్న వారు తిరిగి డబ్బును భారతదేశానికి పంపడం లేదు. ఫలితంగా సుమారు రూ.50 వేల కోట్లు కరెంట్ అకౌంట్ లోటును తెచ్చి పెట్టినట్టు ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఆర్బీఐ చెబుతున్న లెక్కల ప్రకారం.. పదేళ్లలో భారతీయుల విద్యా ప్రయాణానికి సంబంధించి.. వ్యయం రెట్టింపు కంటే పెరిగింది.


2014-15లో రూ.20597 కోట్ల నుంచి 2023-24లో రూ.52 వేల కోట్లకు పెరిగింది. ఈ మొత్తం 2025 నాటికి దేశం నుంచి విదేశాలకు వెళ్లే విద్యార్థుల మొత్తం ఖర్చు రూ. 5లక్షల కోట్లకు పెరుగుతుందని అంచనా.. యూనైటెడ్ స్టేట్స్(అమెరికా), కెనడా, యూకే, ఆస్ర్టేలియా వంటి దేశాల్లో అధిక ఫీజులు, అత్యధిక జీవన వ్యయాలున్నా భారతీయ విద్యార్థులు విదేశీ విద్యకు ప్రసిద్ధ గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఆ తర్వాత జర్మనీ, ఐర్లాండ్, సింగపూర్, రష్యా, ఫిలిఫ్పీన్స్, ఫ్రాన్స్, న్యూజిలాండ్ లను ఎంపిక చేసుకుంటున్నారు.


అలాగే మన దేశానికి వచ్చే ఎక్కువ మంది దక్షిణాసియా, ఆఫ్రికన్ దేశాలకు చెందిన వారే.  నేపాల్ అత్యధిక సంఖ్యలో విద్యార్థులను భారతదేశానికి పంపుతోంది. 2024-15లో 21 శాతం నుంచి 2021-22లో 28 శాతానికి పెరిగింది. 2014-15తో పోల్చితే అఫ్గానిస్తాన్, భూటాన్, మలేసియా, సూడాన్, నైజీరియా విద్యార్థుల శాతం తగ్గింది. భారత్ కు ఎక్కువ మంది విద్యార్థులను పంపుతున్న దేశాల వరుసలో అఫ్గానిస్తాన్ 6.72 శాతంతో రెండో, భూటాన్ 3.33 శాతంతో ఆరో దేశంగా నిలుస్తోంది. 2021-22లో అమెరికా విద్యార్థులు 6.71 శాతంతో మూడో స్థానాన్ని. బంగ్లాదేశ్ 5.55 శాతం, యూఏఈ 4.87 శాతంతో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: