అది ఓ ఇల్లు. అందులో ఒ కుటుంబం నివసిస్తోంది.  ఈ లోపు తలుపు చప్పుడయింది. అయినా ఆ కుటుంబ సభ్యులు తలుపు తీయలేదు. దీంతో కొందరు మారణాయుధాలతో ఆ తలుపులు బద్దలు కొట్టారు. ఇంట్లోకి ప్రవేశించారు. దొరికిన వస్తువులను దొరికినట్టే చిందర వందరగా దోచుకున్నారు. ఆ ఇంట్లో వాళ్లను భయభ్రాంతులకు గురి చేశారు. ఆడవాళ్లపై అసభ్యంగా ప్రవర్తించారు.


ఈ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ మారుతున్నాయి. ఇంతకీ ఈ ఘటన జరిగింది పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ లో కాదు. పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో. ప్రస్తుతం అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయి. ప్రధానిగా షేక్ హసీనా బాధ్యతల నుంచి వైదొలగడంతో అక్కడి పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. బంగ్లాదేశ్ లో ముస్లిం ఆధిపత్యం ఉన్నా హిందువుల జనాభా అక్కడ 12 శాతం వరకు ఉంటుంది. సంఖ్య పరంగా చూసుకుంటే దాదాపు కోటిన్నర వరకు ఉంటారు.


షేక్ హసీనా ప్రభుత్వంలో హిందువులకు రక్షణ ఉండేది. పైగా ఆమె భారత్ అనుకూల వాదిగా ఉండటంతో హిందువులకు ఇబ్బంది లేకుండా పోయింది. కానీ ఇప్పుడు హసీనా ప్రభుత్వం కుప్పకూలడం, అదే టైంలో బంగ్లా సైనికుల ఆధిపత్యంలోకి వెళ్లడం అక్కడ శాంతి భద్రతలు క్షీణించాయి.  హిందువుల మీద దాడులు విపరీతంగా పెరిగాయి. నేరుగా ఇళ్లలోని వెళ్లి చిత్రహింసలకు గురి చేస్తున్నారు. హిందువుల దేవాలయాల గత కొన్ని రోజులుగా చూస్తే మాడి మసై పోయాయి.


గాంధీ, ఇందిరా గాంధీ వంటి భారత జాతి నేతల విగ్రహాల ధ్వంసం చేశారు. దీంతో హిందువులు బయటకు రావడం లేదు. బిక్కుబిక్కుమంటూ తమ ఇళ్లలోనే గడుపుతున్నారు. మరోవైపు బంగ్లాదేశ్ లో హిందూ మహిళలు మేము ఇక్కడ ఉండలేమంటూ మొర పెట్టుకుంటున్నారు. వారంతా ఏం పాపం చేశారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే రిజర్వేషన్ల పేరుతో సాగిన ఉద్యమం వెనుక చాలా దురాలోచనలు ఉన్నాయని.. కుట్ర పూరితంగా ఉద్యమం నడిచిందని అర్థం అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: