ప్రపంచ పటంలో భారతదేశానికి  ఎప్పుడూ ప్రత్యేక స్థానమే అని అంటుంటారు. ఇక్కడ వస్త్ర ధారణలే కానీ.. సంస్కృతి సంప్రదాయాలే కాని, ప్రజాస్వామ్య పద్ధతులే కానీ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. ఇదొక శాంతి కాముక దేశం అని అందరూ అభినందిస్తుంటారు. సవాళ్లతో నిండిని మన భారతానికి ప్రపంచంలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.


కానీ.. అయినా కొంతమంది పనిగట్టుకొని సోషల్ మీడియా, ఇతర వాటిలల్లో మన దేశాన్ని అపహాస్యం చేసే ప్రయత్నం చేస్తుంటారు.  మనకంటే చిన్న దేశాలతో పోలుస్తూ.. మన స్థాయిని తగ్గిస్తుంటారు. అంతిమంగా వారు నివసిస్తున్న మన దేశాన్ని సపోర్టు చేయరు. పక్క దేశాన్నే ఇష్టపడుతుంటారు. వీరినే మనం సెక్యూలర్ వాదులు అని గొప్పగా చెబుతూ ఉంటాం. ఈ సంగతి పక్కన పెడితే.. మన దేశ గొప్పతనాన్ని ఒక్కసారి మనం తెలుసుకుందాం.


మన పొరుగున ఉన్న పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంకలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇక పాశ్యాత్య దేశాల విషయానికొస్తే.. యూకే, ఫ్రాన్స్ లు అశాంతి నెలకొంది. స్పెయిన్ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటుంది. ఇక అగ్రరాజ్యం అమెరికా ఏకంగా ఎన్నికలకు ముందు అంతర్గత వివాదాలతో పాటు నాయకత్వ సమస్యతో బాధపడుతోంది.


ప్రపంచంలో ఇన్ని సవాళ్లతో కూడిన అంశాలు ఉన్నప్పటికీ భారత్ మాత్రం స్థిరంగా ఉంటూ... సుసంపన్నంగా ఉంది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడంతో పాటు.. స్టాక్ మార్కెట్ వృద్ధి చెందుతోంది. ఇక్కడ స్వేచ్ఛగా ప్రయాణించి.. ప్రశాంత జీవనం గడపొచ్చు. దీనంతటికీ ప్రధాని మోదీ అనుసరిస్తున్న విధానాలే కారణం.


అయితే బంగ్లాదేశ్ లో కూడా షేక్ హసీనా పలు కీలక సంస్కరణలు తీసుకువచ్చారు. అయినా విపక్షాలు కుట్రలు పన్ని ఆమెను పక్కను తప్పించారు. బంగ్లాలో ఉండని నోబెల్ పురస్కార గ్రహీత ముహమ్మద్ యూనస్ కి ప్రధాని బాధ్యతలు అప్పజెప్పారు.  మన దేశంలో కూడా చాలా మంది ప్రధాని మోదీ పని అయిపోయిందని.. ఆయన దిగి పోవాలని కోరుకుంటున్నారు.  మరీ ఆయన్ను దింపేసి ఎవర్నీ ఆ పీఠంపై కూర్చోబెట్టాలో మాత్రం చెప్పడం లేదు. ఆర్థిక వేత్తలను, మన దేశాన్నితక్కువ చేసే విశ్లేషకులునా అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: