ఏపీ సీఎం ప్రసంగాలు వింటుంటే ఎక్కడో తేడా కొడుతుందనే అనుమానం కలగక మానదు. ఆయన  ఎక్కడికి వెళ్లినా ముందుగా ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. తాను అన్నీ చేయాలనుకుంటున్నాను, కానీ ఏమీ చేయలేకపోతున్నాను అని చెప్పుకొస్తున్నారు.  పైగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావొస్తోంది.


ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రకటనలు, శ్వేత పత్రాలు, వ్యవహార శైలి చూస్తుంటే ఇప్పుట్లో హామీలు అమలు చేసేలా కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన జగన్ వైఫల్యాలను ఎండ గట్టే పనిలో ఉన్నారు తప్ప సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించడం లేదు. రాష్ట్రం దివాళా అంచున ఉందని.. దాదాపు రూ.10 లక్షల కోట్లు అప్పు చేశారని.. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం వడ్డీలు కట్టడానికే సరిపోతుందని ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు.


ఇదిలా ఉండగా..  సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ముందుగా ఆగస్టు 15న అన్నా క్యాంటీన్లు, ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. వీటి అమలు కోసం రాష్ట్ర ప్రజలు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లుగా కనిపిస్తోంది.


ప్రస్తుతం ఈ పథకంపై అధ్యయనం అవసరం అంటూ ఓ కమిటీని వేశారు. ఇది కాలయాపన కోసమే తప్ప అమలు చేసే ఉద్దేశం కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని మరో రెండు నెలల పాటు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీనిపై రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ.. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరో రెండు నెలల్లో ప్రారంభిస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. గడిచిన రెండు రోజుల క్రితం త్వరలోనే అయిపోతుందని చెప్పిన ఆయన ఇప్పుడు తాజాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీంతో ఏపీ మహిళలంతా నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తాము లోటు బడ్జెట్ తో అధికారంలోకి వచ్చినా కానీ రెండు నెలల్లోనే నవరత్నాలను అమలు చేశామని.. వైసీపీ గుర్తు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: