కేంద్ర ప్రభుత్వం పేదలను ఆదుకునేందుకు వినూత్నమైన పథకాలను ప్రవేశ పెడుతోంది. కానీ స్కీమ్స్ పై అవగాహన లేక చాలా మంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. దేశంలోని మహిళలు, యువతకు ఆర్థిక సాయం అందించి వారిని వ్యాపారవేత్తలుగా మార్చేందుకు కేంద్ర కృషి చేస్తోంది.


మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే పెట్టుబడి అవసరం. అంత డబ్బు మన దగ్గర ఉండకపోవచ్చు. ఈ కారణంగా అసలు వ్యాపారం చేద్దామనే ఆలోచనే మనం విరమించుకుంటాం. అయితే ఇలాంటి వారికి కేంద్రం గుడ్ న్యూస్  చెప్పింది. కేంద్ర ప్రభుత్వం పథకం ద్వారా యువత రూ.50 వేలకు మించి పొందే అవకాశం ఉంది.


అవును.. కేంద్రం ప్రధాన మంత్రి షెడ్యూల్డ్ కులలా అభ్యుదయ యోజన(పీఎం అజయ్) పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం ద్వారా షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ)లు నిరుద్యోగ యువత, మహిళలు స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్థిక సాయాన్ని అందిస్తోంది.


అయితే ఏపీలోని దళిత నిరుపేదలకు ఈ సందర్భంగా కేంద్రం గుడ్ న్యూస్ చెప్పిందనే అనుకోవచ్చు. ఎలా అంటే మనకి ప్రత్యేకంగా ఈ పథకం కింద రూ.151 కోట్లను మంజూరు చేసింది. స్వయం సమృద్ధి సాధించాలనుకునే మహిళలు, యువత ఈ రుణాలను పొందవచ్చు.  రూ.50 వేల నుంచి గరిష్ఠంగా రూ.3లక్షల వరకు రుణాలను అందిస్తోంది. ఇందులో మళ్లీ 50 శాతం రాయితీని కూడా కేంద్రమే భరిస్తోంది.


తిరిగి మనం చెల్లించాల్సింది తీసుకున్న దాంట్లో సగం అమౌంట్ మాత్రమే. వీటిని కూడా ఒకేసారి కూడా వాయిదా పద్ధతిలో చెల్లించుకోవచ్చు. అయితే కేంద్రం ఇచ్చిన రూ.151 కోట్లను ఏపీ ప్రభుత్వం పేరు మార్చి అమలు చేయాలని చూస్తోంది. దీనికి కొన్ని షరతులు పెట్టి పథకం నిర్వీర్యం కాకుండా చూడాలని భావిస్తోంది. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ఎలాగూ అధికారంలో ఉంది కాబట్టి.. పేర్చు మార్చేందుకు కేంద్రం ఒప్పుకుంటుందా అంటే.. ప్రస్తుతానికి పేరు మార్చి అమలు చేసేందుకు ససేమిరా అంటోంది. ఒకవేళ అలా చేస్తే క్రెడిట్ మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి పోయే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: