మీడియా అనేది ప్రజాస్వామ్యంలో ఫోర్ట్ ఎస్టేట్ అంటుంటారు. కానీ ఆ నాలుగో స్తంభం.. ఇప్పుడు పార్టీ జెండాలను మోస్తున్నాయి. ఏ పార్టీలు ప్యాకేజీలు, ప్రకటనలు ఇస్తే.. ఆ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాయి. అక్రమాలను, అవినీతిని దాచి పెడుతున్నాయి. ఛానళ్ల తీరుతోనే సోషల్ మీడియా బలపడింది.


ఏపీలో ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు, ఈటీవీ, ఏబీఎన్, టీవీ 5 లతో పాటు మరికొన్ని ఛానళ్లు టీడీపీ పక్షం వహించి వార్తలు ప్రచురిస్తూ.. ప్రసారం చేస్తుంటాయి. ఇక సాక్షి, సాక్షి టీవీ, టీవీ 9, ఎన్టీవీ తో పాటు మరికొన్ని ఛానళ్లు వైసీపీకి అనుకూలంగా వార్తలు రాస్తూ ఉంటాయి. ఆయా పార్టీలు అధికారంలో ఉన్నా లేకపోయినా వారి పక్షమే వహించి.. వేరే వారిపై బురద జల్లేందుకు యత్నిస్తుంటాయి.


ఈ ఎల్లో మీడియా, బ్లూ మీడియాలు తమకు అనుకూలంగా లేని వారిపై విపరీతమైన నెగిటివ్ ప్రచారం చేస్తుంటాయి. ఈ ఛానళ్లు తమ వ్యతిరేక ప్రభుత్వాల వైఫల్యాలను మాత్రమే ఎత్తి చూపుతూ ఉంటాయి. ఈ క్రమంలో అందులోని మంచిని సైతం మరుగున పడేస్తాయి. అవి ప్రజలకు మేలు చేసేవే అయినా.. ఆయా రాజకీయ పార్టీలకు మేలు చేస్తూ వారికి అనుకూలంగా వార్తలు రాస్తుంటాయి.


ప్రస్తుతం జగన్ పై ఓ వర్గం మీడియా దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకుంది.  వైసీపీ హయాంలో చేసిన పనులన్నీ ఓ కుంభకోణంలా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ జగనన్న బీమా పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ప్రభుత్వం బీమా కల్పించింది. ఈ పథకానికి పలు ఇన్సూరెన్స్ కంపెనీలను గత ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ టెండర్ల విషయంలో జగన్ కు సన్నిహితుడికి టెండర్ రావడం కోసం దాని నిబంధనలు మార్చారు. ఆసంస్థకి ఇవ్వాల్సిన డబ్బులు రూ.113 కోట్లు అయితే చెల్లించిన మొత్తం రూ.42 కోట్లు. టెండర్లు అంటేనే అందరికీ వర్తించే నిబంధనలే ఉంటాయి. ఈ విషయాన్ని మరిచిపోయి ఇష్టం వచ్చినట్లు బురద జల్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: