కానీ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి అనుకూలంగా పని చేయాల్సి వస్తుంది. వారు చెప్పింది చేయకపోతే ప్రాధాన్యం లేని శాఖకు బదిలీలు, అటాచ్ లు, ఖాళీగా ఉండటాలు వంటివి ప్రస్తుతం మనకి కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది అధికారులపై వేటు పడింది. గత ఐదేళ్లుగా వైసీపీ నేతలకు కొమ్ము కాశారని చాలా మంది అధికారులపై ఫిర్యాదులు ఉన్నాయి.
అదే సమయంలో టీడీపీ నేతల విషయంలో అడ్డగోలుగా వ్యవహరించిన వారు ఉన్నారు. దీంతో సీఎంవో జిల్లాల స్థాయి నుంచి ప్రక్షాళన ప్రారభించింది. కూటమి స్పష్టమైన మెజార్టీ సాధించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సెలవులోకి వెళ్లిపోయారు. చాలా మంది అధికారులను రిజర్వులో పెట్టారు. ఈ జాబితాలో సీనియర్, ఐఏఎస్, ఐపీఎస్ లు సైతం ఉన్నారు.
ఇదిలా ఉండగా.. గత వైసీపీ ప్రభుత్వం కూడా ఇదే తరహా విధానాలను అమలు చేసింది. అధికారంలోకి రాగానే టీడీపీ సానుభూతిపరులుగా ముద్ర పడిన వారందరినీ పక్కకు తప్పించింది. అందులో భాగమే ఏవీ వెంకటేశ్వరరావు ఉదంతం. పొరుగు రాష్ట్రం తెలంగాణ కూడా దీనికి అతీతమేమీ కాదు. అక్కడ పార్టీకి తగ్గ పాలకులున్నారు. ఇప్పుడు వారి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు లోకి వస్తున్నాయి.
మొత్తానికి ఐఏఎస్ లు, ఐపీఎస్ లు ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా వారి పనులు వారు చేసుకుంటే ప్రాధాన్యం తక్కువ ఉన్న శాఖ తగ్గినా.. ఆ తర్వాత వారికి ఎటువంటి ఇబ్బందులు, విచారణలు ఉండవు. ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఏబీ వెంకటేశ్వరరావు ఘటనలు మనకి అవే నేర్పిస్తున్నాయి.