సినిమాల్లో మంచి నటన కనబర్చినందుకు నటులను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు అవార్డులు అందజేస్తుంటాయి. అలాగే ప్రభుత్వాలను నడిపే వ్యక్తులకు కూడా అవార్డులు ఇచ్చే సంస్థలు ఉన్నాయి. మన దేశంలో ఉన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, వాటి అధినేతలు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు అనే విషయంలో ఇండియా టుడే ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది.


ఈ జాబితాలో దక్షిణ భారతదేశం నుంచి ఇద్దరు ముఖ్యమంత్రులు టాప్-5 లో చోటు దక్కించుకున్నారు. సీఎంల పనితీరు, వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాల ఆధారంగా చేసుకొని నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఐదో స్థానంలో నిలిచారు. కాగా ఈ జాబితాలో తొలి స్థానంలో యూపీ సీఎం యోగీ ఆధిత్యనాథ్ ఉండగా.. రెండో స్థానంలో  దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు.


మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చోటు దక్కించుకోగా.. నాలుగో స్థానంలో దక్షిణాది సీఎం స్టాలిన్ ఉన్నారు. స్టాలిన్ కు 4.7శాతం ఓట్లు రాగా.. చంద్రబాబుకు 4.6శాతం ఓట్లు వచ్చాయి. ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలలకే ఐదో స్థానంలో నిలిచారని.. త్వరలోనే అన్ని స్థానాలు దాటుకొని మొదటి స్థానానికి చేరుకుంటారని టీడీపీ నాయకులు పేర్కొంటున్నారు.


ఏపీ సీఎంగా చంద్రబాబు నాలుగో సారి ప్రమాణ స్వీకారం చేసి మూడు నెలలు కావొస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదని ప్రతిపక్షాలు గొగ్గోలు పెడుతున్నా జాతీయ స్థాయిలో ఉత్తమ సీఎంలో జాబితాలో ఆయనకు చోటు దక్కడం గమనార్హం. అయితే దీనిని  టీడీపీ శ్రేణులు విపరీతంగా ప్రచారం చేసుకుంటున్నాయి.  అయితే నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న నేతకి జాతీయ స్థాయిలో మద్దతు లభించిందనే చెప్పొచ్చు. అందుకు తక్కువ కాలంలో టాప్‌-5 జాబితాలో చోటు దక్కిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: