జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ  సీఎం దాకా ఎదిగిన తీరు అభినందనీయం. కానీ ఆ హోదాలో నుంచి ఇంకా ఎదగాలన్నదే అందరి కోరిక. ముఖ్యంగా బలమైన సామాజిక వర్గం కోరిక. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల పవర్ చాలడం లేదని.. ఆయన గ్రామ సభలో పాల్గొన్న ఒక వ్యక్తి అభిప్రాయపడ్డారు.


అంటే చాలా మంది కోరిక పవన్ సీఎం కావాలని. సీఎం కావాలంటే ఏమి చేయాలి. ఆ దిశగా సరైన కార్యాచరణను రూపొందించుకొని ముందుకు సాగాలి. కానీ పవన్ మాత్రం ఇంకా చంద్రబాబు అభిమానిగానే ఉండిపోతున్నారు. ఆయనలో అణువణువూ చంద్రబాబు మీద ప్రేమాభిమానాలు ఉప్పొంగుతున్నాయి. దానిని ఎవరూ కాదనరూ. కానీ చంద్రబాబుని పొగిడితే పవన్ అక్కడే ఉండిపోతారు.


ఆయన తనకంటూ సొంతంగా ఆలోచించడం ద్వారానే సొంత సామాజిక వర్గంతో పాటు పాటు ప్రజలు అనుకుంటున్నట్లుగా సీఎం అవుతారు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే ఏపీ వ్యాప్తంగా ఒకేసారి వేలాదిగా గ్రామ సభలు నిర్వహించడం అన్న మాట.


ఈ గ్రామ సభల్లో కూడా ప్రజలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. అలా కొత్త ఒరవడికి ఆయన  శ్రీకారం చుట్టారు. అయితే ఈ గ్రామ సభల ప్రారంభం సందర్భంగా అన్నమయ్య జిల్లాలో మైసూరావారిపల్లొలో జరిగిన కార్యక్రమంలో పవన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. అపార అనుభవం ఉన్న ఆయన దగ్గర నేర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.


సరిగ్గా ఈ సభ సందర్భంగా చేసిన పలు వ్యాఖ్యలే ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. అయతే చంద్రబాబు దగ్గర రాజకీయం కూడా నేర్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఉంది. దాని మీద పవన్ ముద్ర కనిపిస్తుందా అనే ప్రశ్నలు ఉన్నాయి. మరి ఇంకా చంద్రబాబునే పొగుడుతూ ఉంటే పవన్‌ సీఎం అయ్యెదెన్నడో అని ఆయన అభిమానులు పెదవి విరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: