హైడ్రా అధికారులు సినీ నటుడు నాగార్జునకి చెందిన మాదాపూర్ లోని ఎన్-కన్వెన్షన్ ను అక్రమ కట్టడంగా చెబుతూ కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడే ప్రశ్నించారు. అక్రమ కట్టడం అని తెలిసినా ఎందుకు కూల్చడం లేదు అని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నాగార్జునకి మీకు ఎలాంటి లావాదేవీలు జరిగాయి అని ప్రశ్నించారు.


ఇప్పుడు అధికారంలోకి రాగానే దీనిని కూల్చివేయించారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం అక్రమ కూల్చివేతల పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హీరో అయ్యారు. ఇదే సందర్భంలో మనం గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. 2019లో అధికారం చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఒక ఇల్లు కట్టుకున్నారు. అంటే ఆ ఇల్లు నది లోపలే ఉంది. దీనిని జగన్ చర్యలకు ఉపక్రమించగానే.. రాజకీయ కక్ష సాధింపులు చర్యగా మీడియా చూపించింది.


ఫలితం ప్రజల్లో చంద్రబాబుపై సానుభూతి.. జగన్ పై వ్యతిరేకత వ్యక్తం అయింది. ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ ను కూల్చగానే మీడియా ఆహా.. ఓహో అంటూ రేవంత్ రెడ్డి ఆకాశానికి ఎత్తుతోంది. అదే సందర్భంలో ప్రస్తుత ఏపీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇంటి మొత్తాన్ని కూల్చలేదు. రెండు అడుగులకు సంబంధించిన గోడను కూల్చివేశారు. వాటిని కూడా కక్ష సాధింపు చర్యలు అన్నారు. ఎందుకంటే వారు ప్రత్యర్థి పార్టీల వారు కాబట్టి.


ఇప్పుడు కూడా ప్రత్యర్థి అయిన నాగార్జునదే కాబట్టి ఏనాడో సీఎం రేవంత్ చెప్పారు. కానీ అక్కడ విలనిజం అయితే తెలంగాణలో హీరోయిజం అయింది. అయితే ఇక్కడ జగన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే.. తన సొంత పత్రికనే కాకుండా.. ఇతర న్యూట్రల్ పత్రికలను ప్రోత్సహించాలి. లేకపోతే మరో నాలుగైదు న్యూస్ ఛానళ్లతో టై అప్ అవ్వాలి. అధికారంలో ఉన్నప్పుడు వాటికి సపోర్టు చేస్తే ఓడిపోయిన తర్వాత అండగా నిలుస్తారు. ఇప్పుడు టీడీపీ విషయంలో జరిగింది అదే. మీడియా లేకపోతే ఎన్ని రూ.లక్షల కోట్లు ఖర్చు పెట్టినా ప్రయోజనం ఉండదు అని ఈ ఉదంతం నిరూపితం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: