తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత 11 మంది ఎమ్మెల్యేలతో సర్ది పెట్టుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం ప్రస్తుతం ఫైట్ చేస్తున్నారు. ఇది వస్తుందా రాదా అనే అంశం పక్కన పెడితే..


ఇప్పటికిప్పుడు ఆయన కీలక కార్యక్రమానికి రెఢీ అయ్యారు. అదే ప్రజలతో మమేకం కావడం. కార్యకర్తలకు కనిపించడం. వారి సమస్యలు పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేయడం. వాటిని ఎలుగెత్తి చాటడం. తాజాగా విశాఖలో పర్యటించి అచ్యుతాపురం బాదితులను ఆయన ఓదార్చారు. ఈ సమయంలో కొందరు మీరు జనంలోకి రావాలని కోరారు.


ఔను.. నిజం దీనికి సంబంధించిన వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఈ పరిణామాలతో జగన్ ప్రజలను కలుసుకునేందుకు తాడేపల్లి ప్యాలెస్ లో ప్రజలు, పార్టీ కార్యకర్తలు ప్రవేశించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని తాజాగా ఆదేశించినట్లు తెలిసింది. పార్టీ వర్గాలు కూడా ఇదే మాట చెబుతున్నాయి. ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఊహించని జగన్.. తనంతటి వారు లేడన్నట్లుగా ఊహించుకొని వ్యవహరించారు.


తను తప్ప.. ప్రజలకు దిక్కు లేదని.. అనుకున్నారు. తనను గెలిపించి తీరుతారని అని కూడా లెక్కలు వేసుకున్నారు. కానీ తీర్పు భిన్నంగా వచ్చింది. అప్పట్లో ప్రజలకు చేరువ కావాలి. పార్టీ కేడర్ ను పట్టించుకోవాలని.. చాలామంది నాయకులు చెప్పారు. అయినా జగన్ వినిపించుకోలేదు. తొలి ఏడాది అంటే 2019లో ఏదో కొన్ని రోజులు పాటు పార్టీ కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించినా ఆ తర్వాత దానిని పూర్తిగా మర్చిపోయారు.


అంతేకాదు ప్రజలకు అన్నీ మేలే చేస్తున్నాం.. ఇక వారికి ఏం సమస్యలు ఉంటాయని కూడా చేసిన వ్యాఖ్యలు గుర్తుండే ఉంటుంది. మరోవైపు ప్రజలకు వాలంటీర్లకు మధ్య బంధాన్ని పెంచారు. చివరకు అదే ఎదురుదెబ్బ కొట్టింది. దీంతో ఇప్పుడు అసలు వాస్తవం తెలిసింది. తాజాగా ప్రజలు కూడా మీరు జనంలోకి రావాలని కోరారు. ఈ నేపథ్యంలో కొత్త కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. ఇక నుంచి ఆదివారం మినహా ఆరు రోజుల పాటు తాడేపల్లి లోని పార్టీ కార్యాలయంలో జగన్ ప్రజలకు అందుబాటులో ఉండనున్నారు. దీనికి సంబంధించి ఒకేసారి 100 మంది కూర్చొనేలా ఏర్పాట్లు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: