ప్రపంచమంతా యుద్ధాలతో మునిగిపోయిన దశలో శాంతి వచనాలు పలికితే ఆ  ప్రయత్నాన్ని మెచ్చని వారు ఎవరుంటారు? మిగతా దేశాలన్నీ విఫలమైన చోటనే ఓ దేశాధినేత తన వంతు ప్రయత్నంలో శాంతి నెలకొల్పితే దానిని ఎవరు కాదంటారు?


ఇప్పుడు అదే పని చేస్తున్నారు భారత ప్రధాని మోదీ. రెండున్నరేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మోదీ తప్ప ఇతర దేశాలకు చెందిన వారు ఎవరూ శాంతి మాట ఎత్తలేకపోయారు. అందుకే మోదీ శాంతి దూతలా కనిపిస్తున్నారు.


ఉక్రెయిన్.. అమెరికా సారథ్యంలోని నాటో కూటమిలో చేరే ప్రయత్నంతో రష్యా యుద్ధానికి దిగింది. దీంతో సహజంగానే నాటో కూటమిలోని దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ తదితరాలకు రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ కు సాయం చేయడం మొదలు పెట్టాయి. ఆయుధాలు, ముందు గుండు సహా అనేక విధాలుగా సాయం చేస్తూ యుద్ధాన్ని పరోక్షంగా ఎగదోస్తున్నాయి. మధ్యలో తుర్కియే వంటి దేశాలు సంధి ప్రయత్నాలు మొదలు పెట్టినా అవి ముందుకు సాగలేదు. ఒక్క భారత్ మాత్రమే శాంతి శాంతి అని ఉద్భోధిస్తోంది.


రష్యాతో భారత్ బంధం దశాబ్దాలుగా పటిష్ఠమైనది. ఓ  దశలో అమెరికా పాకిస్థాన్ కు సాయంగా భారత్ పై యుద్ధానికి వస్తే రష్యానే అడ్డుకుంది. ఇప్పుటి పరిస్థితులు మారాయి. ఉక్రెయిన్ తో మనకి అంత బలమైన సంబంధాలు లేకపోయినా భారతీయ విద్యార్థులు అక్కడ వేలమంది చదువుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ ఆది నుంచి రష్యా-ఉక్రెయిన్ కు సర్ది చెబుతూ వస్తోంది.


ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలు అయ్యాక ఆ రెండు దేశాలను సందర్శించిన దేశాధినేత ఎవరైన ఉన్నారా అంటే అది మోదీనే. ఇక తాజాగా ఉక్రెయిన్ పర్యటనలో మోదీ మరింత చొరవ చూపారు. రెండు దేశాల చర్చలకు తాను స్నేహితుడిగా సాయం చేస్తానని ప్రకటించారు. యుద్ధానికి తక్షణ ముగింపు పలకాలని సూచించారు. ఒకవేళ ఈ యుద్ధాన్ని ఆపితే ఏకంగా ప్రతిష్ఠాత్మక నోబెల్ శాంతి బహుమతికి మోదీ ఎంపికైనా ఆశర్యం  ఉండదేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: