తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఎవరి చేతిలో అధికారం ఉంటే వారి చుట్టూనే నేతలు తిరిగే అలవాటు ఎక్కువ అయింది. గతానికి భిన్నంగా అధికారం చుట్టూనే నేతలు తిరుగుతున్నారు. గడిచిన ఐదేళ్లలో తిరుగులేని అధికారం ప్రదర్శించి.. ఎదురే లేన్నట్లు ఉన్న వైసీపీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర ఓటమి పాలై తీవ్ర కుదుపులకు లోనవుతోంది.



ఇప్పటికే పలువురు నేతలు, మాజీలు పార్టీకి దూరంగా కాగా ఇప్పుడు మరికొందరు అదే బాటలో పయనిస్తున్నారు. వీరిలో కొందరు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం గమనార్హం. వైసీపీ ప్రభుత్వంలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరున్న ఆర్కే రోజా పార్టీకి దూరం కానున్నట్లు  చెబుతున్నారు.


ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో రాజకీయం చేయడం తనకు సాధ్యం కాదన్న విషయాన్ని ఆమె గుర్తించారని.. అదే సమయంలో వైసీపీలో ఉండకూడదు అని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరగుతుంది. ఈ వాదనకు బలం చేకూరేలా ఆమె వ్యవహార శైలి ఉంది. సోషల్ మీడియాలో జగన్ ను అన్ ఫాలో చేయడం, ప్రొఫైల్ పిక్ లో మార్పు రావడం చూస్తుంటే ఇదంత నిజమే అనిపిస్తోంది.


మరోవైపు జగన్ కు ఆది నుంచి సన్నిహితుడిగా ఉన్న మోపిదేవి వెంకట రమణ, బీదా మస్తాన్ రావులు కూడా రాజీనామా చేస్తారని చెబుతున్నారు. వీరిద్దరూ దిల్లీకి వెళ్లడం, అక్కడ తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేస్తారని వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వీరిద్దరూ తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. పార్టీ మీద ప్రజా వ్యతిరేకత కారణంగా ఈ  నిర్ణయాన్ని తీసుకున్నట్లు వారు చెబుతున్నారంట.


ఇదిలా ఉండగా వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీకి రాజీనామా చేస్తూ తన నిర్ణయాన్ని ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన లేఖను ఆమె వైసీపీ అధినేత జగన్ కు పంపారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడటం జగన్ కు దెబ్బ మీద దెబ్బలా విశ్లేషకులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో మరికొందరు ముఖ్య నేతలు కూడా ఫ్యాన్ పార్టీకి దూరం కానున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: