అతి త్వరలోనే రాజ్యసభలో వైసీపీ ఖాళీ కాబోతుందా? ప్రస్తుతం అవే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వైసీపీలో ఉన్న రాజ్యసభ ఎంపీలు అంతా పార్టీ మారతారు అన్నట్లు తెలుస్తోంది. వైసీపీకి ఉన్న ప్రస్తుత రాజ్యసభ ఎంపీలు తమకు నచ్చిన దారి చూసుకున్నట్లు సమచారం. వారిలో టీడీపీలోకి మగ్గురు, బీజేపీలోకి ఐదుగురు, జనసేనలోకి మిగతా వేరు చేరతారు అన్నట్లు చెబుతున్నారు.


ఇప్పటికే సదరు నేతలు వైసీపీ పై పరోక్షంగా అసమ్మతి వెళ్లగక్కుతున్నారు. వారిలో ఒకరిద్దరు బహిరంగంగానే తమ అధినేతపై అసహన వ్యాఖ్యలు చేస్తుండగా మరికొందరు మాత్రం తమ అనుచరుల వద్ద అభిప్రాయాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇంకొంత మంది ఇతర పార్టీ అగ్ర నేతలతో టచ్ లోకి వెళ్లినట్లు టాక్. ఇప్పటికే వైసీపీ ఎంపీల్లో ఇద్దరు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు లు తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు నడుస్తారనే బలమైన ప్రచారం అయితే జరగుతోంది.


బీజేపీలోకి రఘునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని వెళ్తారని అంటున్నారు. మరోవైపు జనసేనలోకి ఆర్.కృష్ణయ్య, పిల్లి సుభాష్ చంద్రబోస్.. టీడీపీలోకి మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు, గొల్ల బాబూరావు లు చేరతారు అని అంటున్నారు. వీరితో పాటు ఎన్డీయే కూటమిలోకి పలువురు మాజీ నేతలు పార్టీ నేతలు కార్యకర్తలు చేరుతున్నట్లు వైసీపీ నేతలే ఉప్పందిస్తున్నారు.


దీంతో కింది స్థాయి వైసీపీ నేతలే కాక. పెద్ద స్థాయిలో నేతలు వైసీపీని వీడుతున్నట్లు స్పష్టం అవుతుంది. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీకి ప్రాతినిథ్యం లేదు. వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ ధైర్యంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా జగన్ ధైర్యంగా ఉన్నారు. ఆ ధీమాతోనే దిల్లీ వెళ్లి ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు. ఇండియా కూటమి నేతల మద్దతు కూడగట్టారు. కానీ ఇప్పుడు వైసీపీ ఎంపీలు పార్టీ మారుతుండటంతో జగన్ అవసరం ఎవరికీ లేకుండా పోతుంది. ఇదే జరిగితే జగన్ పార్టీ పార్లమెంట్ లో క్లోజ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో జగన్ ను ఇటు ఇండియా కూటమి.. అటు బీజేపీ పట్టించుకునే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn