వైసీపీలో నెంబర్ 2 అంటే వెంటనే విజయ సాయి రెడ్డి పేరు గుర్తుకు వస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ తర్వాతి ప్లేస్ ఆయనదే. పార్టీ ఆవిర్భావం నుంచి కాకుండా.. అంతకు ముందు నుంచే జగన్ వెంట అడుగులు వేశారు. ఇక సాధారణ ఛార్డడ్ అకౌంటెంట్ గా ఉంటూ.. జగన్ పరిశ్రమలన్నింటిని చూసుకునేవారు. అందుకే జగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 గా నిలిచారు.
జగన్ తో పాటు 16 నెలలు జైలు జీవితం అనుభవించారు. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు అహర్నిషలు కృషి చేశారు. టీడీపీతో బీజేపీ విడిపోవడం వెనుక.. అదే బీజేపీ దయ వైసీపీ పొందడం వెనుక విజయ సాయి రెడ్డి కృషి కూడా చాలానే ఉంది. వైసీపీతో పాటు జగన్ కోసం పెద్దల అనుగ్రహం పొందాలని ఆయన చాలా ప్రయ్నతాలు చేశారని అప్పట్లో టాక్ కూడా నడిచింది. వైసీపీ అదికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డికి సముచిత స్థానం దక్కుతూ వచ్చింది.
రాజ్యసభ పదవికి ప్రమోట్ అయ్యారు. రాజ్యసభలో బలమైన వైసీపీ విపక్ష నేతగా ఉన్నారు. పార్టీతో ఇంతటి అనుబంధం ఉన్న ఆయన పార్టీ మారుతారు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమి పాలైంది. దీంతో జగన్ పార్టీలో కీలక నేతలు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. ఈక్రమంలో vijayasai REDDY' target='_blank' title='విజయసాయి రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>విజయసాయి రెడ్డి కూడా పార్టీ మారతారు అని.. బీజేపీలో చేరేందుకు సంప్రదింపులు కూడా పూర్తయ్యాయని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది.
ఇప్పుడు వైసీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేస్తుండటంతో విజయ సాయి రెడ్డి అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై ఆయన స్పందిస్తూ.. వైసీపీని తాను వీడటం లేదని… జగన్ వెంటే ఉంటానని.. వేరే పార్టీలో చేరనని స్టేట్ మెంట్ ఇచ్చారు. అయితే ఇలా ప్రకటన ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది. ఆయన్ను ఎవరైనా ప్రశ్నించారా అంటే సమాధానం లేదు. ఆయన అంతటికి తానుగా పార్టీ మారను అని వివరణ ఇచ్చారు. దీంతో ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో ఇదే చర్చ నడుస్తోంది.