వైపీపీకి భారీ డ్యామేజ్ జరగుతోందా? ఆ పార్టీ నైతికత దెబ్బతింటోందా? అది చేజాతులా హైకమాండ్ చేసుకున్న నష్టమా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒక పద్ధతి ప్రకారం ఒక దాని తర్వాత ఒకటి వైసీపీ నైతికత దెబ్బతీసేలా వ్యూహాలు పన్నుతోంది. ప్రతిపక్షం రోజుకో వీడియో బయటకు తీస్తూ.. వైసీపీ నేతలకు భయాందోళనలు సృష్టిస్తోంది.
తొలుత విజయసాయి రెడ్డి ఎపిసోడ్ నడిచింది. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ భర్త తెరపైకి వచ్చారు. తన భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు. విజయసాయి పై తనకు అనుమానాలు ఉన్నాయని ఆరోపించారు. ఏకంగా డీఎన్ఏ టెస్టుకి డిమాండ్ చేశారు. కానీ ఎందుకో ఆయన అనుమానాలు నివృత్తి చేసేలా వైసీపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కానీ ఇష్యూని డైవర్ట్ చేసి సైలంట్ అయ్యారు.
ఆ తర్వాత ఎమ్మెల్సీ దువ్వాడ ఫ్యామిలీ వ్యవహారం బయటకు వచ్చింది. కుటుంబ కథ అనుకున్నా.. ఇంతటి విభాగానికి ఓ మహిళ కారణం అని బయటపడింది. దాదాపు పక్షం రోజులకు రచ్చ నడిచింది. ఇప్పటికే ఫుల్ స్టాప్ పడటం లేదు. దీనిని మరిచేలోగా ఎమ్మెల్సీ అనంతబాబు అసభ్య వీడియో బయటకు వచ్చింది. అది మార్ఫింగ్ వీడియో అని చెబుతున్నా బాధితులే స్వయంగా బయట పెట్టడంతో వైసీపీకి ఇబ్బందిగా మారింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లతో వైసీపీ నైతికత దెబ్బతింది.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటివి జరిగాయి. కానీ అధికారంలో ఉండటంతో అవన్నీ సైడ్ అయిపోయాయి. కానీ ఇప్పుడు విపక్షానికి వచ్చే సరికి సీన్ సితార్ అవుతోంది. ప్రజాక్షేత్రంలో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మాంసం తిన్నవారు ఎముకలు మెళ్లో కట్టుకుంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతల తీరు అలా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఓ మంత్రి అరగంట అన్నారు. మరొకరు గంట అని అన్నారు. ఇలా అన్న ఆడియోలు బయటకు వచ్చాయి. కానీ వైసీపీ హైకమాండ్ వాటి గురించే పట్టించుకోలేదు. దీంతో ఇది ఆ పార్టీలో అలవాటు అంశంగా మారిపోయింది. నాడు వీరిపై నిర్లక్ష్యంగా వ్యహరించింది. నేతలపై చర్యలకు ఉపక్రమించలేదు. దీంతో ఫలితం ఇప్పుడు అనుభవిస్తోంది. పార్టీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతోంది.