జగన్ విదేశీ పర్యటన నుంచి వచ్చే సరికి వైసీపీ ఖాళీ అవుతుందా? ఆ పార్టీని వీడేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారా? తెర వెనుక ఏదో జరుగుతోందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ సాగుతోంది. టీడీపీ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. జగన్ కుటుంబ సమేతంగా  లండన్ వెళ్లనున్నారు. దాదాపు 20 రోజుల పాటు అక్కడే ఉంటారు.


కూతురి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లేందుకు ఇప్పటికే సీబీఐ అనుమతి తీసుకున్నారు జగన్. గత మూడు రోజులుగా పులివెందుల నియోజకవర్గంలో జగన్ గడిపారు. తిరిగి ఈ నెల 25న రాష్ట్రానికి రానున్నారు. అయితే ఆయన వచ్చే సమయానికి వైసీపీ అడ్డగోలుగా చీల్చుతారని ప్రచారం జరుగుతుంది. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీల అధినేతలు, సీఎంలు విదేశాలకు సమయంలో ఆ పార్టీలని అడ్డగోలుగా చీల్చడం చూశాం. అధికారాన్ని హస్తగతం చేసుకోవడం చూశాం. అయితే ఇప్పుడు వైసీపీ బలాన్ని, బలగాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది.


అయితే ఇది ఎంత వరకు సాధ్యం అవుతుందో చూడాలి. ఇప్పటికే వైసీపీ నుంచి వలసలు ప్రారంభం అయ్యాయి. ఆ పార్టీకి చెందిన ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు లు పార్టీకి గుడ్ బై చెప్పారు. తమ ఎంపీ పదవులకు రాజీనామా చేశారు. మిగతా వారి పేర్లు వినిపిస్తున్నా వారంతా జగన్ వెంటే ఉంటామని ప్రకటిస్తున్నారు. అయితే వీరిలో ఒకరిద్దరు తప్ప మిగిలిన వారంతా వైసీపీ వీరవిధేయులే కావడం విశేషం.


అయితే రాజ్యసభ సభల్లో చాలామంది వ్యాపారులు, వ్యాపార సంస్థలు ఉండటంతో వారు వైసీపీలో ఫిక్స్ గా ఉంటారా లేదా అనుమానమే. ఎంపీలు, ఎమ్మెల్సీలు పార్టీలతో పాటు పదవులకు రాజీనామా చేస్తున్నారు. వీరు పదవులతో పాటు టీడీపీ కూటమిలో  చేరే పరిస్థితి లేదు. ఆ రెండు చోట్ల కూటమి ప్రాతినిథ్యం పెరగడమే ముఖ్యం ఉద్దేశం. వీరు రాజీనామా చేస్తే కనీసం పోటీలో పెట్టే పరిస్థితి లో కూడా వైసీపీ లేదు. కానీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం అంత ఈజీ కాదు. ఆ పార్టీకి చెందిన మోసేన్ రాజు మండలి ఛైర్మన్ గా ఉన్నారు. ఆయన ఆమోదిస్తే కానీ రాజీనామాలు కుదిరే పని కాదు. మరి ఏం జరగుతుందో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: