ఏపీకి అప్పులు పుట్టడం లేదు. ఖజానాలో నిధులు లేవు. ఏమీ చేయమంటారు అని డైరెక్ట్ గా జనాలతోనే ఉన్న విషయం సీఎం చంద్రబాబు చెప్పేశారు. ఏపీకి అప్పులు పుట్టకపోవడానికి మాజీ సీఎం జగన్ అని కూడా కారణమని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఏపీకి రూ.10 లక్షల 50 వేల కోట్లు అప్పులు చేసి జగన్ గద్దె దిగిపోయారని ఆయన చెప్పారు.
జగన్ ఎక్కడా లేని విధంగా అన్నీ ఊడ్చేసి అప్పులు చేసేశారు. దాంతో తాను ఇప్పుడు చేద్దామన్నా ఏపీకి ఎవ్వరూ అప్పులు ఇవ్వడం లేదు అని సరికొత్త విషయాన్ని చెప్పారు. ఏపీకి ఆదాయం తక్కువ ఖజానా ఖాళాగా ఉంది. పోని అప్పులు చేద్దామంటే అసలు కుదరడం లేదు. దీనికి జగన్ కారణం అని చంద్రబాబు ఒక పెద్ద బండ ఆయనపై వేసేశారు.
ఏపీకి వరదలు వచ్చాయి. ఇంతటి తీవ్రత ఎక్కడా గతంలో లేదు. మరి ఇంతలా వరదలు వచ్చినా అందరికీ న్యాయం చేయలేకపోయామని పూర్తిగా సాయం అందించడం లేదని చంద్రబాబు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పేశారు. చంద్రబాబు విజయవాడలో ముంపు ప్రాంతాలు అయినా భవానీపురం, ఊర్మిళా నగర్ లో మరోసారి పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి ప్రజలతో మాట్లాడారు.
ఈ సమయంలోనే ఆయన జగన్ గురించి పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. ఏపీకి అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. దానికి జగన్ చేసిన విచ్చలవిడి అప్పులే కారణమని అన్నారు. ఇవన్నీ పక్కన పెడితే చంద్రబాబు ఏపీకి అప్పులు ఉన్నాయని.. అవి జగన్ వల్లేనని అంటున్నారు. దీంతో డబ్బులు లేవని హింట్ ఇస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ సమయంలో ప్రజలు అర్థం చేసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఉన్నాయని ప్రచారంలో చంద్రబాబు పదే పదే చెప్పారు. ఈ విషయం తెలిసి కూడా మళ్లీ జగన్ వీటిని నెట్టేసి హామీల అమలు విషయంలో చేతులు దులుపుకొంటారా అనే సందేహాలు పలువురిలో వ్యక్తం అవుతున్నాయి. వరదలకే ఇలా అంటే.. సూపర్ సిక్స్ పథకాల సంగతేంటి అని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.