తెలంగాణ సర్కారులో ఖాళీగా ఉన్న ఆరు మంత్రి పదవుల విషయంలో సీనియర్ల నుంచి ఒకింత పలుకుబడి ఉన్న వారి వరకు ప్రతి ఒక్కరు పోటీ పడుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు నిరుద్యోగులు పోటీ పడినట్టే.. ఇప్పుడు మంత్రి పదవుల కోసం నాయకుల మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉంది. కొందరికీ నేరుగా అధిష్ఠానంతో సంబంధాలు ఉండటంతో అటు నుంచి నరుక్కొని వస్తున్నారు. మరికొందరు రేవంత్ రే తమ నాయకుడిగా పేర్కొంటూ… ఆయనపైనే ఆశలు పెట్టుకున్నారు.



ఇంకొందరు పని తీరు… విధేయతను నమ్ముకున్నారు. ఎలా చేసినా.. అరు స్థానాలకు 15 మంది వరకు నాయకులు పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీ మారిన వారు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే .. ఈ విషయంలో రేవంత్ రెడ్డి గతంలోనే ఒక స్పష్టత ఇచ్చారు.


పార్టీలు మారి వచ్చిన వారికి మంత్రి పీఠాలు ఎలా ఇస్తాం అంటూ వ్యాఖ్యానించారు. సీనియర్లు లేరా వారు చేసిన పనులు ఎలా మర్చిపోతామా? అని కూడా వ్యాఖ్యానించారు. అయినా జంపింగులు కూడా ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు  బాగానే ఆశలు పెట్టుకున్నారని సమాచారం. ఆయనకు ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లోను టికెట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఓడిపోయారు. ఇప్పుడు తనకు మంత్రి పదవి ఖాయమని.. చెబుతున్నారు.


ఇక సుదీర్ఘ రాజకీయ వారసత్వం ఉన్న కాకా.. తనయులు గడ్డం వివేకానంద ఆయన సోదరుడు కూడా మంత్రి పీఠాలపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే వీరు అధిష్ఠానంతో మాట్లాడుకున్నారని సమాచారం. ఇదిలా ఉంటే షబ్బీర్ అలీ, అజారుద్దీన్ లు కూడా ముందంజలో ఉన్నారు. మైనార్టీ కోటాలో వీరిలో ఒకరికి ఖాయంగా కనిపిస్తోంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కూడా తనకు వరించబోతుందా? అని ఎదురు చూస్తున్నారు.  ఇక రెడ్డి కోటాలో సుదర్శన్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రామ్మెహన్ రెడ్డి లు ముందు వరుసలో ఉన్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: