కోల్ కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో నిరసన తెలుపుతున్న జూనియర్ డాక్టర్లకు, మమతా బెనర్జీకి ప్రభుత్వానికి మధ్య ప్రతిష్ఠంభన నెలకొంది. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. సమ్మె విరమించాలని స్వయంగా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మనోజ్ మంత్  ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లను అనధికారిక చర్చలకు ఆహ్వానించారు.


బెంగాల్ ప్రజలు ఎదురు చూస్తున్నారని.. ఇప్పటికైనా పరిష్కారం దొరుకుతుందని ఆశిస్తున్నామని మమతా బెనర్జీ అన్నారు. వైద్యులను తిరిగి విధుల్లోకి తీసుకురాలేకపోయినందుకు వారికి క్షమాపణలు చెబుతున్నానని ఆమె అన్నారు. అయితే మమతా బెనర్జీ కోసం రెండు గంటల 10 నిమిషాలు వేచి ఉన్నా, వైద్యులు చర్చలకు సిద్ధంగా లేకపోవడంతో మమతా బెనర్జీ సంచలన ప్రకటన చేశారు. ప్రజలకు క్షమాపణలు చెబుతూ తిరిగి విధుల్లో వైద్యులకు విజ్ఙప్తి చేశారు.


తాను న్యాయం చేసేందుకు రాలేదన్నారు. వారికి కుర్చీ కావాలి. ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సీఎం పదవి వద్దు.. దోషులకు విచారించాలని కోరుతున్నాను. సామాన్యులకు న్యాయం జరగాలి. అంటూ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భావోద్వేగానికి లోనయ్యారు. బెంగాల్ ప్రజలకు ముకుళిత హస్తాలతో క్షమాపణలు చెబుతున్నానని పశ్చిమ బెంగాల్ సీఎం అన్నారు.


30 మంది జూనియర్ డాక్టర్ల వైద్యుల ప్రతినిధి బృందం నబన్కు చేరుకుంది. అయితే నిరసన తెలిపిన వైద్యుల సంభాషణలను ప్రత్యక్ష ప్రసారం చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందుకు నిరాకరించారు.. దీంతో ఇరు పక్షాల మధ్య చర్చల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. కోల్ కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీలో మహిళా వైద్యురాలపై అఘాయిత్యం, హత్య ఉదంతంపై దేశ వ్యాప్తంగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే.. వైద్యుల నిరసనల కారణంగా చికిత్స అందక 27 మంది మరణించారని మమతా బెనర్జీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: