అబ్బే ఇది ఎమ్మెల్యే గాంధీ చేసిన దాడి కాదు… సీఎం రేవంత్ రెడ్డి చేయించింది. కౌశిక్ రెడ్డి ఆంధ్రా వాళ్లను ఏమీ అనలేదు. గతంలో రేవంత్ రెడ్డి కూడా చిన జీయర్ ని, ఆనంద్ సాయి తో పాటు ఆంధ్రా వాళ్లని కించపరిచారు అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు డ్యామేజ్ కంట్రోల్ కామెంట్లు ప్రారంభించారు.


పోలీస్ స్టేషన్ లో జరిగిన తోపులాటలో గాయం అయిందని కౌశిక్ రెడ్డి ఇంట్లో హౌస్ అరెస్టు నుంచి ఆసుపత్రికి వెళ్లి.. తర్వాత కోకాపేటలోని తన విల్లాకు చేరుకున్న హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్ మొత్తం ఎక్కడా ఆంధ్రావాళ్లు, సెటిలర్లు మీదకు ఇంకా చెప్పాలంటే ఎమ్మెల్యే గాంధీఆ మీదకు ఒక్క మాట కూడా పోకుండా పూర్తిగా రేవంత్ ని టార్గెట్ చేశారు. సమస్య వచ్చిన ప్రతి సారి సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్ చేస్తున్నారని.. డైవర్షన్ చేస్తున్నారని  ఆరోపించారు.


హరీశ్ రావు రేవంత్ డైవర్షన్ గేమ్ ఆడుతున్నారని ముందే ఊహించుకుంటే ఆయన కౌశిక్ పై దాడి జరిగిందంటూ సిద్ధి పేట నుంచి వచ్చేసి .. సినిమాలో తాను భాగమయ్యే వారు కాదు. కానీ రేవంత్ ట్రాప్ లో వ్యూహాత్మకంగా బీఆర్ఎస్ చిక్కింది. అందులో హరీశ్ భాగం అయ్యారు.



కౌశిక్ రెడ్డి ఆంధ్రా వాళ్లపై చేసిన వ్యాఖ్యలను పట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా చేసిన హంగామా చూసి మరింతగా ఆంధ్రా వాళ్లమంటూ దూషణలు చేశారు. కానీ ఈ వివాదాన్ని రేవంత్ రెడ్డి పక్కాగా ఉపయోగించుకున్నారు. నిజంగా ఆయన ట్రాప్ వేశారో కౌశిక్ రెడ్డి ఛాన్స్ ఇచ్చారో బీఆర్ఎస్ నేతలకు తెలియాలి. ఇప్పుడు ఆంధ్రా వాళ్లకు తాము వ్యతిరేకం కాదని చెప్పుకునేందుకు హరీశ్ రావు తంటాలు పడుతున్నారు. తనకు రావాల్సిన పదవిని తీసుకున్న గాంధీని కూడా ఆయన ఒక్క మాట అనలేకపోతున్నారు. కానీ ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: