ఇటీవల ఏపీ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ సారథ్యంలోని వైసీపీ ఘెర పరాజయం పొందింది. ఎవరూ ఊహించని ఫలితాల్ని వైసీపీ నేతలు చవిచూశారు. 151 నుంచి 11 సీట్లకు వైసీపీ పడిపోయింది. దీంతో ఇక ఆ పార్టీ పని అయిపోయిందని… మళ్లీ పుంజుకోవడం కష్టం అని రాజకీయ ప్రత్యర్థులు అనుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జగన్ కూడా డైలమాలో పడినట్లు అనేక విశ్లేషణలు వార్తలు వినిపించాయి.


ఈ నేపథ్యంలో ఏపీలో తాజాగా కొన్ని ఘటనలు జరిగాయి. వాటి వెనుక కారణాలు ఏమైనా.. జగన్ మాత్రం తన స్టైల్ లో ముందడుగు వేశారు. ఓటమి నుంచి తేరుకొని ప్రజల్లోకి వెళ్లారు. ఈ క్రమంలో మళ్లీ వైసీపీ క్యాడర్ లో జోష్ నెలకొంది. ఎన్నికల తర్వాత కొందరు వైసీపీ నేతలపై దాడి జరిగింది. వాటిని ఖండించిన జగన్.. వినుకొండలో జరిగిన దాడిపై కొంచెం స్ర్టాంగ్ గా రియాక్ట్ అయ్యారు. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండ వెళ్లారు. ప్రజల నుంచి ఊహించని స్పందన వచ్చింది.


ఈ తర్వాత కడప పర్యటనకు వెళ్లారు. అక్కడా అంతే. ఇక గన్నవరం, బెంగళూరు ఎయిర్ పోర్టు ఎక్కడకి వెళ్లినా జగన్ ని చూసేందుకు జనం బారులు తీరారు. విజయవాడ వరద ప్రభావిత  ప్రాంతాల్లో, కాకినాడ జిల్లా లో కూడా అనూహ్య స్పందన వచ్చింది.


దీంతో వైసీపీకి జగన్ మళ్లీ ఊపిరిలూదుతున్నారు. పార్టీ క్యాడర్ కి కూడా ధైర్యం వస్తుంది. ఈ నేపథ్యంలో గోడ దూకుదామనే నేతలు కూడా డైలమాలో పడి ఆగిపోయారు. వలసలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా.. జగన్ ఇక ప్రజల్లోకి వెళ్లేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కూటమి వైఫల్యాలను ప్రజల ముందు ఉంచి.. ఎన్నికల్లో వారు చెప్పిన మాటలతో మాస్ ర్యాగింగ్ చేస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు జగన్ ను చంద్రబాబు లైట్ తీసుకున్నారు. ఫలితం స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు కూడా జగన్ ని అదే మాదిరి లైట్ తీసుకుంటే మాత్రం టీడీపీ కూటమి నష్టపోయే ప్రమాదముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: