కేంద్రంలో మిత్రుల మద్దతుతో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న బీజేపీకి రెండు రాష్ట్రాల ఫలితాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయా అంటే జవాబు అవుననే వస్తోంది. అందులో ఒకటి కశ్మీర్.


సరిగ్గా అయిదేళ్ల క్రితం బీజేపీ తీసుకున్న ఓ నిర్ణయం  విప్లవాత్మకమైన నిర్ణయానికి జనాలు ఇచ్చే తీర్పుకి ఒక రెఫరెండంగా మోదీ ప్రభుత్వానికి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. రెండోది హరియాణా ఎన్నికలు. ఇవి కూడా బీజేపీకి గెలవాల్సిన అనివార్యతతో కూడుకున్నవే. తమాషా ఏంటంటే.. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం అసెంబ్లీ స్థానాల్లో చెరో 90 ఉన్నాయి.


ఇందులో మ్యాజిక్ ఫిగర్ 46 మార్క్ ని బీజేపీ అందుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే కనుక హరియాణాలో బీజేపీ గెలిచే అవకాశాలు అయితే లేవు అనే అంటున్నారు. రెండు సార్లు వరసగా అధికారం చేపట్టిన బీజేపీకి ఈ సారి ప్రతిపక్షం ఖాయమని అంటున్నారు. అక్కడ కాంగ్రెస్ నేతలు కూడా బాగా బలం పుంజుకుంది. దీంతో కాంగ్రెస్ నేతలు కూడా హరియాణా మాది అనే జోస్యం చెబుతున్నారు.


జమ్మూ కశ్మీర్ కథ కూడా అలానే ఉంది. అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ తో కాంగ్రెస్ జత కట్టింది. ఈ రెండు పార్టీల కూటమి బలంగా ఉంది. దీంతో బీజేపీకి అక్కడ అధికారం అందని ద్రాక్షలా మారుతుందని అంటున్నారు. బీజేపీకి మిత్రులు కూడా ఎవరూ లేరు. అంతా ప్రత్యర్థులే. పైగా అందరూ ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించేవారు. దీంతో బీజేపీ ఒంటరి పోరాటం చేస్తోంది.


ఒకవేళ బీజేపీ ఓడితే.. పరిస్థితి ఏంటనేది చర్చంతా. అసలే బిహార్ సీఎం నితీశ్ కుమార్ మౌనంగా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. ఆయన మెల్లగా ఇండియా కూటమికి దగ్గర అవుతున్నారు. బీజేపీకి రెండు రాష్ట్రాల్లో దెబ్బ పడింది అంటే నితీశ్ తన గొంతు పెంచుతారు. ఆయన దారి ఆయన చూసుకుంటారు. అదే జరిగితే కేంద్రం లోని బీజేపీకి మనుగడ కష్టం అవుతుంది. ఏది ఏమైనా ఈ రెండు రాష్ట్రాల ప్రభావం బీజేపీపై పడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: