ఏపీ సీఎంగా నాలుగోసారి అధికారం చేపట్టిన చంద్రబాబుని హామీల అమలు విషయంలో వెంటనే అమలు చేయాలని మాజీ సీఎం జగన్ గట్టిగానే ఒత్తిడి పెంచుతున్నారు. చంద్రబాబు  ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఆయన మీడియా సమావేశం పెట్టి మరీ ఏకరువు పెడుతున్నారు.


ఎన్నికల ముందు హామాలు అన్నీ అమలు చేస్తాను అని బాబు చెప్పాడా లేదా అని జగన్ జనాలనే మీడియా ముఖంగా అడుగుతున్నారు. అంతే కాదు నీకు పది హేను  వేలు, నీకు పదిహేను వేలు సంతోషంగా అంటూ ప్రతి ఇంటి గడప తొక్కి మరీ చంద్రబాబు హామీలను టీడీపీ నేతలు వల్లె వేశారని ఆయన చెప్పారు. ఇక పిఠాపురం టూర్ లో అయితే జగన్ విశ్వరూపం చూపించారు.

అచ్చం చంద్రబాబు మాదిరిగా ఆయన లాగానే హావభావాలను వ్యక్తం చేస్తూ ఇమిటేడ్ చేశారు. హామీలు ఎక్కడ ఎప్పుడు అమలు చేస్తారు అంటూ చంద్రబాబుని రెట్టించారు.


నాలుగు నెలలు అయింది అధకారంలోకి  వచ్చి.. హామీలను నెరవేర్చకుండా ఎందుకంత లేట్ అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో జగన్ కంటే ఎక్కువ ఇస్తాను అని చెప్పి ఇష్టం వచ్చినట్లు హామీలు ఇచ్చినవి ఇప్పుడు గుర్తున్నాయా అని ఎకసెక్కమాడారు.


ప్రజల్ని పూర్తిగా మోసం చేశారని.. అమలుకు సాధ్యం కాని హామీలను  ప్రకటించి సీఎం అయ్యారు అని విమర్శించారు. అంతేకాకుండా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో కూటమి అధికారంలోకి వస్తే రైతన్నలకు రూ.20 వేలు ఇస్తామని చెప్పారు. ఇంటిల్లి పాది పిల్లలకు ఎవరు కనిపించినా కూడా రూ.15 వేలు ఇస్తామని తప్పుదోవ పట్టించారన్నారు.


ఇలా ఏ చిన్న పిల్లవాడు కనిపించినా.. కూడా మీకు రూ.15 వేలు, మీకు పదిహేను వేలు ఇస్తానని మోసం చేశారని ఇమిటేడ్ చేస్తూ విమర్శించారు. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు రూ.1500 అని చెప్పారని గుర్తు చేశారు. మొత్తం మీద చంద్రబాబుని మాజీ సీఎం జగన్ మాస్ ర్యాగింగ్ తో ఆటాడుకుంటున్నారని వైసీపీ నాయకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: