బీజేపీలో తిరుగులేని రాజకీయ ఆధిపత్యం చలాయిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ మూడు సార్లు ఆ సీట్లో కూర్చున్నారు. కానీ ఆయన టార్గెట్ 2029పై కూడా ఉంది. ఆయన ఇటీవల ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. 2029లోను బీజేపీ గెలుస్తుందని.. తానే ప్రధాని హోదాలో మరోసారి కచ్చితంగా ఈ సదస్సుకు వస్తానని గట్టిగా బల్లగుద్ది మరీ చెప్పారు.


దీని అర్థం ఇంకో సారి కూడా ప్రధాని కావాలన్నదే మోదీ ఆలోచన అని విశ్లేషకులు అంటున్నారు. అయితే బీజేపీలో మోదీకి ఈ రోజుకి గట్టిగా పట్టు ఉంది. బీజేపీకి 240 సీట్లు వచ్చాయి. అవి కాస్తా ఏ 200 దగ్గర ఆగిపోయి ఉంటే మోదీ ప్లేస్ లోకి చాలా మంది రేసులోకి వచ్చేవారు. అయితే అటువంటి బాధ లేకుండా మూడోసారి ప్రధాని మోదీనే అయ్యారు. అయితే ఆయన అయిదేళ్లు ఈ పదవిలో ఉండగలరా?


ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు పదే పదే కేంద్ర పడిపోతుందని ఎందుకు అంటున్నారు అని ఆరోపిస్తున్నారు. ఇండియా కూటమి నేతలు ఎందుకు అంత బలంగా ఎన్డీయే కూటమి అయిదేళ్లు నడవదని నమ్మకం పెట్టుకున్నారు. ఒక వైపు జేడీయూ.. మరో  వైపు టీడీపీ మద్దతుతో ఎన్డీయే నడుస్తోంది.


నిజానికి మోదీకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే బీజేపీలో చాలా పేర్లు వినిపిస్తాయి. అందులో మొదటిస్థానం నితిన్ గడ్కరీ. ఆయన జాతీయ నాయకుడిగా మూడు దశాబ్దాల పాటు ఉన్నారు. అంతేకాదు ఇప్పటికే దశాబ్ధిన్నర క్రితమే జాతీయ ప్రెసిడెంట్ కూడా అయ్యారు. ఆయన్ను ముందుకు తీసుకురావడానికి సంఘ్ పరివార్ చూస్తోందని విశ్లేషకులు అంటున్నారు.


ఇక అమిత్‌ షా, రాజ్ నాథ్ సింగ్, యోగీ ఆదిత్యనాథ్, శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలా చాలా పేర్లు ఉన్నాయి. నాకు విపక్షం ప్రధాని పదవి ఆఫర్ ఇచ్చింది. కానీ నేను నైతిక విలువలకు కట్టుబడి నో చెప్పాను అని నితిన్ గడ్కరీ బాంబ్ పేల్చారు. ఇలా నితిన్ తన ఆలోచనలను బయట పెట్టారా అనే చర్చ కూడా నడుస్తోంది. దీంతో ఇప్పుడు ఆయన పేరు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొత్తం మీద చూస్తే మోదీ సీటుకే ఆయన గురి పెట్టారా అని కొంతమంది అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: