వైఎస్ జగన్ కేరాఫ్ తాడేపల్లి. ఇది పాత పాట. ఆయన అసలు చిరునామా బెంగళూరు. ఆయన ఓటమి తర్వాత బెంగళూరు లోని తన ప్యాలెస్ కి మకాం మార్చారు. ఆయన తాడేపల్లి కి చుట్టుపు చూపుగా వచ్చి పోతున్నారు అని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. అయినా వైసీపీ అధినేత వాటని పట్టించుకోవడం లేదు.



ఆయన ఆలోచనలు వేరుగా ఉన్నాయి. బెంగళూరు లో అయితే తన రాజకీయ వంటకానికి ఏ విధంగా  అవరోధాలు ఉండవు అని జగన్ భావిస్తున్నారు. మరోవైపు చూస్తే జగన్ కి బెంగళూరు పూర్తి సేఫ్  జోన్ గా ఉంది. ఆయన హైదరాబాద్ కంటే కూడా బెంగళూరు నే ఫ్రిపర్ చేస్తున్నారు అని అంటున్నారు. బెంగళూరు లో జగన్ కి ఎంతో అనుబంధం ఉంది. మూడు దశాబ్ధాల పరిచాయలు ఉన్నాయి. పైగా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అందులో ఒక కీలక నేత ట్రబుల్ షూటర్ తో కూడా గట్టిగా పరిచయాలు ఉన్నాయి.


వైఎస్సార్ ఫ్యామిలీకి హితుడు అయిన ఆయనతో జగ్ కి గుడ్ రిలేషన్స్ ఉన్నాయని కూడా అంటున్నారు. అందుకే ఆయన అక్కడ మకాం వేసేందుకు ఇష్టపడుతున్నారని అంటున్నారు. ఇక బెంగళూరులోని జగన్ నివాసానికి తరచూ కాంగ్రెస్ నేతలు వస్తూ ఉన్నారు అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. వారం పది రోజుల క్రితం ఒక వీకెండ్ లో జగన్ కాంగ్రెస్ నేతలు విందు ఇచ్చారు అని టీడీపీ ఆరోపించింది.


అన్నీ అనుకూలిస్తే ఆయన ఇండియా కూటమిలో చేరడం అనివార్యం కావొచ్చు అనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు వైసీపీకి జాతీయ స్థాయిలో బలం కావాలి. ఆఅండ కాంగ్రెస్ నుంచి ఇండియా కూటమి నుంచే కోరుకుంటున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ వైసీపీ ఇండియా కూటమిలోకి వస్తే అది ఏపీ పాలిటిక్స్ లో హైలెట్ అవుతుంది. మరి జగన్ బెంగళూరు వంటకం విజయవంతం అవుతుందా లేదా అని చూడాలని అంటున్నారు. మరి దీనికోసమే ఆయన వెళ్తున్నారన్న పుకార్లు నిజం అవుతాయా లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: