పవన్ కల్యాణ్ అంటే తపన ఉన్నవారు. అది ఆయన సన్నిహితులకు మాత్రమే ఇప్పటి దాకా తెలిసిన విషయం. ఆయన ప్రజా నాయకుడిగా మరి ఈ రోజున అధికారంలోకి వచ్చాక పవన్ అంటే అందరికీ తెలిసి వస్తోంది. ఒక రాజకీయ నాయకుడు ఏకంగా ఆరు కోట్ల విరాళం ఇవ్వడం వర్తమాన రాజకీయ చరిత్ర అయతే ఎరుగదు. అది ఒక్క పవన్ కల్యాణ్ తోనే సాధ్య పడింది.
పవన్ కల్యాణ్ అంటేనే అది అని తన మార్క్ ని ఆయన అలా రుజువు చేసుకున్నారు. పవన్ కల్యాణ్ కి ప్రజలు అంటే ఇష్టం అని మరో మారు అలా చాటి చెప్పారు. పవన్ కల్యాణ్ ఇటీవల వచ్చిన వరదల వల్ల చలించిపోయి రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో కోటి చొప్పున తన సొంత కష్టాన్ని ఇచ్చారు. అంతే కాదు మరో నాలుగు కోట్ల రూపాయలు ఆయన తాను ఎంతో ఇష్టపడిన పంచాయతీలు వరదల వల్ల నష్టపోయిన తీరుని చూసి ఇచ్చారు. అలా వరద ప్రభావం చూపించిన నాలుగు వందల పంచాయతీలకు తలో రూ.లక్ష చొప్పున అందించారు.
ప్రభుత్వం ఇచ్చే నిధులు కోసం ఆర్రులు చాచి చూసే పంచాయతీలకు రూ.లక్ష చాలా పెద్ద మొత్తమే అని చెప్పవచ్చు. దీంతో ఎంతో కొంత అభివృద్ధి పనులు జరుగుతాయి. ఆ విధంగా తాను అందరికంటే భిన్న రాజకీయ నాయకుడిని అని పవన్ నిరూపించుకున్నారు. అంతే కాదు ఆయన చూస్తున్న పంచాయతీ రాజ్ శాఖలో ఏకంగా ఒకేసారి 13,500పైగా గ్రామ సభలు పెట్టి ప్రపంచ రికార్డుని సృష్టించారు.
ఇది కూడా పవన్ కే సాధ్యమైన రికార్డుగా చూడాలి. పవన్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టి కేవలం మూడు నెలల సమయం మాత్రమే అయింది. ఇంతలోనే తన ముద్రని బలంగా చూపారు. అంతే కాదు ఏపీ పంచాయతీలకు ప్రపంచ గుర్తింపును అలా తెచ్చారు. పవన్ అంటే సాధారణంగా పవర్ స్టార్ అని అంటారు. సినిమా రంగంలోనే కాదు.. రాజకీయ రంగంలోను ఈ రకంగా రికార్డులు సృష్టించడం పవన్ కే సాధ్యం అని ఆయన అభిమానులు సంబుర పడుతున్నారు.