హస్తినలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. దిల్లీ మద్యం కుంభకోణంలో సుప్రీం కోర్టు బెయిల్ ఇవ్వడంతో జైలు నుంచి విడుదల అయిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 17న ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఇప్పటికే గవర్నర్ తో అపాయిట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆయనకు కలిసి రాజీనామా పత్రం సమర్పించడమే ఇక మిగిలింది.


కాగా వచ్చే ఫిబ్రవరి లో దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే నవంబరులో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే దిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారు. బీజేపీకి దమ్ముంటే తన సవాల్ కు సిద్ధం కావాలని పిలుపునిస్తున్నారు.  అయితే సీఎం పదవికి వచ్చే రాజీనామా చేయడం వల్ల వచ్చే సానుభూతిని కేజ్రీవాల్ క్యాష్ చేసుకోవాలనుకుంటున్నారనే టాక్ నడుస్తోంది. ఆయన వ్యూహం ఇదేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


కేజ్రీవాల్ సైతం తాను సీఎం పదవికి రాజీనామా చేశాక దిల్లీలో ఇంటింటీక వెళ్తానన్నారు. తాను నిర్దోషినని భావిస్తేనే ఓటేయాలని ప్రజలను కోరతానన్నారు. అందుకే వచ్చే ఫిబ్రవరి వరకు దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆగకుండా ఈ ఏడాది నవంబరులోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటే నిర్వహించాలని కేజ్రీవాల్ డిమాండ్ చేస్తున్నారని అంటున్నారు. అయితే కేజ్రీవాల్ డిమాండ్ కు అంగీకరించే పరిస్థితిలో కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ లేదని అంటున్నారు.


షెడ్యూల్ ప్రకారమే.. వచ్చే ఫిబ్రవరిలోనే దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించే యోచనలో ఈసీ ఉందని చెబుతున్నారు. మరోవైపు దిల్లీ సీఎం పదవికి కేజ్రీవాల్ చేస్తానని ప్రకటించారు. దీంతో తదుపరి సీఎం ఎవరనే దానిపై చర్చ నడుస్తోంది. కేజ్రీవాల్ సతీమణి సునీత, మంత్రి ఆతిషీ, రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా తదితరుల పేర్లు సీఎం పదవికి వినిపిస్తున్నాయి. తదుపరి సీఎం ఎవరనేదానిపై ఆప్ ఇంకా  ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే కేజ్రీవాల్ సతీమణి పేరే ఎక్కువగా వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: