టీడీపీ అధినేత చంద్రబాబు దత్తపుత్రుడిగా పేర్కొంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ని టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత.. అప్పట్లో సీఎంగా వ్యవహరించిన వైఎస్ జగన్ మోహన్రెడ్డి మొదలు వైసీపీకి చెందిన ముఖ్యనేతలంతా చంద్రబాబుని నాలుగు మాటలు అంటే పవన్ కల్యాణ్ ని మాత్రం ఎనిమిది మాటలు అనేవారు.


చంద్రబాబుని అనేందుకు అన్నో ఇన్నో విషయాలు అనుకోవచ్చు. పవన్ కల్యాణ్ విషయానికొస్తే ఆయన వ్యక్తిగతానికి చెందిన పెళ్లిళ్ల అంశాన్ని పెద్ద ఎత్తున ఫోకస్ చేసి అనరాని మాటలు అనేవారు. చేసుకున్నది మూడు పెళ్లిళ్లు.. అది కూడా విడాకులు ఇచ్చిన తర్వాత  చేసుకున్నా.. దాన్నో భూతంగా చూపిస్తూ.. ప్రచారం చేసి బ్యాక్ ఫైర్ అయింది. దీనికి తోడు దశాబ్దానికి పైగా నిజాయితీగా పనిచేస్తున్నా ఎన్నికల్లో విజయం సాధించకపోవడం కూడా పవన్ మీద సానుభూతిని పెంచేలా చేసింది.


తనను అంటే తప్పించి తనకు తాను మాట అనకపోవడం.. ఎవరైనా తప్పు చేస్తే వారి తప్పుల మీద తప్పించి వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం లాంటి అంశాలు ప్రజల్లోకి వెళ్లాయి. అవసరం లేకున్నా పవన్ ను టార్గెట్ చేస్తున్నారన్న భావన ప్రజల్లో కలిగింది. దీంతో ఆయన అప్పటి వరకు ఆయన మీదా.. ఆయన కమిట్ మెంట్ ఉన్న అనుమానాలు సందేహాలు పోయి.. సానుభూతి వెల్లువలా వచ్చింది. సాధారణంగా రాజకీయాల్లో అవకాశాలు కోసం ఎదురు చూస్తుంటారు. పవన్ మాత్రం చంద్రబాబు జైల్లో ఉంటే తన రాజకీయ ఎదుగుదల కోసం.. టీడీపీని నిర్వీర్యం చేసి దాంతో లబ్ధి పొందాలని చూడలేదు. మిత్రుడికి అండగా నిలుస్తూ కష్టంలో అసలు సిసలు స్నేహితుడిగా వ్యవహరించి అందర్నీ ఆకర్షించారు.


ఎన్నికల తర్వాత చేసుకున్న వైసీపీ చేసుకున్న పోస్టు మార్టంలో అవసరం లేకున్నా పవన్ ను టార్గెట్ చేయడం తమకు ఎంతో డ్యామేజ్ అయిందన్న విషయాన్ని గుర్తించారు. ఇక పవన్ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని.. వ్యక్తిగతంగా మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకు పవన్ మీద విమర్శల దాడి తగ్గింది. తనను టచ్ చేస్తే తప్ప.. టార్గెట్ చేసి మరీ మాట్లాడాలన్న ఆలోచన పవన్ లో ఉంటుంది. అదే విషయాన్ని తాజాగా ఆయన చేసి చూపిస్తున్నారు కూడా. మొత్తంగా వైఎస్ జగన్ పవన్ కల్యాణ్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: