జగన్ కోటి రూపాయలను వరద బాధితుల సహాయార్థం ఇస్తామని ప్రకటించారు. ఆయన ఏమైనా సామాన్యుడా వైసీపీ అధినేత.  అంతే కాదు అయిదేళ్ల పాటు ఏపీని ఏలిన సీఎం. ఇప్పుడు బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత. అందువల్ల ఆయన వరదల్లో నానా ఇబ్బందులు పడుతున్న ప్రజానీకం కోసం ఈ విధంగా ఉదారతను చాటుకున్నారు అని అంతా అనుకున్నారు.


అయితే రోజులు గడిచినా. జగన్ చేసిన ప్రకటన మేరకు ఏ కోటి రూపాయిలు సీఎం రిలీఫ్ ఫండ్ కి ఎందుకు ఇవ్వలేదు అన్నది ఒక చర్చగా బయలు దేరింది. సోషల్ మీడియలో అయితే దాని మీద రామ రావణ యుద్ధమే నడిచింది. వైసీపీని టార్గెట్ చేస్తూ టీడీపీ, జనసేన క్యాడర్ అంతా ఎక్కడ సార్ కోటి రూపాయలు అంటూ జగన్ మీద విమర్శలు గుప్పించారు.


ఏపీని వరదలు కనీ వినీ ఎరుగని తీరున వచ్చి అతలా కుతలం చేస్తున్న వేళ ఎందరో పెద్దలు ప్రముఖులు వ్యాపారస్తులు అలాగే వివిధ రంగాలకు చెందిన వారు అంతా ప్రతి రోజు సీఎం రిలీఫ్ ఫండ్ కి తాము ప్రకటించిన మొత్తాన్ని చెక్కు రూపంలో ఇస్తున్నారు. మరి జగన్ ఎప్పుడు చెక్ ఇస్తారా అని గుచ్చి గుచ్చి ప్రశ్నించిన వారు ఉన్నారు.



ఈ విధంగా వైసీపీ నేతలను కూడా ఎక్కడా విడవకుండా మీడియా ముఖంగాను ప్రశ్నల వర్షం కురిపించేస్తున్నారు. దాని మీద సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తనదైన శైలిలో స్పందించారు. జగన్ ప్రకటించిన రూ.కోటి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇవ్వడానికి కాదు. మా పార్టీ తరఫున వరద బాధితులకు సాయం సహకారాలు చేయడానికి అని ఆయన క్లారిటీ ఇచ్చేశారు.


మాకు క్యాడర్ ఉంది. పార్టీ ఉంది. అందువల్ల మేము ఆ మొత్తాన్ని ప్రజలకు వివిధ అవసరాల నిమిత్తం వెచ్చిస్తామని బొత్స అన్నారు. అంతే కాదు జగన్ ఇప్పటికే కోటి సాయాన్ని అందించారని.. మరో పది లక్షలు కూడా లేటెస్ట్ గా ఇచ్చారని లెక్కలు చెప్పారు.


గత రెండు వారాలుగా వరద బాధితులకు సహాయార్థం పాలు, ఆహారం, నిత్యావసరాలు ఇలా అన్నీ వైసీపీ పంపిణీ చేసిందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: