జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యూహాన్ని మార్చుకున్నట్లు కనపడుతుంది. భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఆయన ఏపీ పాలిటిక్స్ ను తన చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు అధికారానికి దూరంగా ఉన్న పవన్ కల్యాణ్ ఇటీవలే డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు.


అయితే అప్పటి నుంచి ఆయన మిత్రపక్షాలతో సయోధ్యతతో సాగుతున్నారు. తాను నొప్పించక.. ఎవరినీ ఒక్క మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుపోతున్నారు. ఎన్నికలకు ముందు దూకుడుగా వ్యవహరించిన ఆయన తర్వాత సైలెంట్ అయ్యారు. ప్రశాంతంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్లు జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి స్పష్టమవుతుంది.


2014లో జనసేన ఏర్పడిన నాటి నుంచి పవన్ కల్యాణ్ పార్టీ నిర్మాణంపై పెద్దగా దృష్టి సారించలేదు. అందులో 2014 ఎన్నికల్లో తాను పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు ఇచ్చినట్లు ఆయన బలం ఏమిటో ప్రత్యర్థులకు తెలిసి రాలేదు. బలం, బలగం తనకు పుష్కలంగా ఉందని నిరూపించుకుందామని 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. పైగా 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోవడంతో అనేక మంది పార్టీని వీడారు. అందుకే పవన్ ఎవర్నీ నమ్మలేదు. దగ్గరకు రానివ్వలేదు.


కానీ 2024 ఎన్నికల్లో తాను వ్యూహంతో వెళ్తున్నానని  చెప్పి మరీ పవన్ కల్యాణ్ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిని  కట్టే ప్రయత్నం  చేశారు. సక్సెస్ అయ్యారు. పవన్ కల్యాణ్ వల్లే కూటమి సాధ్యమైందని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అంగీకరించారు. అందుకే మొన్నటి ఎన్నికల్లో 100 శాతం స్ర్టైయిక్ రేట్ తో  పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేనను గెలిపించుకున్నారు.


ఇప్పుడు పార్టీ చేరికలపై దృష్టి సారించారు. వైసీపీ ని టార్గెట్ చేసినట్తు కనిపిస్తుంది. గతంలో చేరికలను పెద్దగా ప్రాధాన్యం ఇవ్వని పవన్ ఇప్పుడు మాత్రం వాటిపై దృష్టి పెట్టడం చర్చనీయాంశమైంది.  అందులో భాగంగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్, సామినేని ఉదయభానుల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పవన్ ముందు చూపుతూనే ఆర్థిక, బలమైన సామాజిక నేతలను తీసుకుంటున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: