కేకే సర్వే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సంస్థ గురించి పరిచయం అవసరం లేదు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఈ సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్ అంచనాలు వాస్తవ ఫలితాలతో సరిగ్గా సరిపోలడంలో ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఇప్పుడు ఆ సంస్థ అసెంబ్లీ ఎన్నికలు జరుపుకుంటున్న హరియాణాతో పాటు త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మరికొన్ని రాష్ట్రాల్లో సర్వేలు నిర్వహిస్తోంది.


వాటిలో వెల్లడైన ప్రజాభిప్రాయంతో ఆ సంస్థ అధినేత కొండేటి కిరణ్ కుమార్ బీజేపీ ఒక టైటానిక్ షిప్ లా తయారైందని వ్యాఖ్యానించారు. ఇది కేవలం హరియాణాలో నెలకొన్న పరిస్థితి మాత్రమే కాదు.. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుపుకోనున్న మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి ఘెర పరాజయంతో చేదు అనుభవాలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఆ పార్టీ కోర్ ఓటు బ్యాంకు లో తేడా లేనప్పటికీ.. న్యూట్రల్ ఓటు బ్యాంకు మాత్రం తీవ్రంగా ప్రభావితం అయిందని సూత్రీకరిస్తున్నారు.


ఈ క్రమంలో హరియాణాలో తాజా పరిస్థితిపై ఆ సంస్థ అంచనాలు ఏంటో ఓ సారి చూద్దాం.. గత పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి ఓడిపోతుందని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో పోటీ చేస్తున్న ప్రతి మూడు చోట్లలో రెండింట ఓడిపోతుందని కేకే తెలిపారు. బీజేపీ ఓటమికి కారణాలు ఉన్నా.. కాంగ్రెస్ పార్టీకి మాత్రం ప్రభుత్వ వ్యతిరేకతే వరంగా మారనుంది. అంతేకానీ ప్రత్యేక సానుకూలత ఏమీ లేదని కేకే సర్వే చెబుతోంది.


అదే సమయంలో బీజేపీ కోర్ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదని కూడా ఆ సంస్థ వెల్లడించింది. దేశ రక్షణ, అభివృద్ధి వంటి అంశాలు సహా బీజేపీని, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని అభిమానించే వర్గాలు ఆ పార్టీతోనే కొనసాగుతాయని.. ఏ పార్టీకి చెందని న్యూట్రల్ ఓటు బ్యాంకు మాత్రం తీవ్రంగా ప్రభావితం అయిందని ఆ సంస్థ సూత్రీకరించింది. అయితే ఇదే సమయంలో కేజ్రీవాల్ ప్రభావం పెద్దగా ఉండే అవకాశం లేదని కేకే సర్వే సంస్థ అభిప్రాయపడింది. ఒకవేళ జైలు నుంచి కాస్త విడుదలై, ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే ఎక్కువ సమయం గడిపే ఉంటే పరిస్థితి మరోలా ఉండేదేమో కానీ.. ప్రస్తుతం అయితే లేదు అని తేల్చి చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kk