బండి సంజయ్ కుమార్. . ఒకప్పుడు కరీంగనర్ నగర పాలక సంస్థలో కార్పొరేటర్. కార్పొరేటర్ స్థాయి నుంచి ఈ రోజు కేంద్ర మంత్రి వరకు ఎదిగారు. కరీంనగర్ నుంచి మొదలైన ఆయన ప్రస్థానం ఈ రోజు దిల్లీ స్థాయి వరకు చేరింది. అలాగే.. పార్టీని కూడా తెలంగాణలో హైప్ తీసుకురావడంలో ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. గత ఎన్నికల సమయంలో సౌత్ రాష్ట్రాలపై బీజేపీ ప్రధానంగా దృష్టి సారించింది.


ఈ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని ప్లాన్ చేసింది. అందులోను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని టార్గెట్ చేసినా.. ఆ స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోయింది. అయితే దీనికి ప్రధాన కారణం.. బండి సంజయ్ ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పక్కన పెట్టడమే అనేది రాజకీయ వర్గాల్లో వినిపించే టాక్.


2020 మార్చి నెలలో బండి సంజయ్ కుమార్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్న అన్నీ రోజులు పార్టీని గల్లీ వరకు విస్తరింపజేశారు. ఈ గ్రామానికి వెళ్లినా బీజేపీ అంటే తెలిసొచ్చేలా అవగాహన కల్పించారు. సంజయ్ అధ్యక్షుడు కాకముందు రాష్ట్రంలో ఆ పార్టీ ప్రభావం అంతంత మాత్రమే. పైగా సిటీకి మాత్రమే పరిమితం అయింది. కానీ ఆయన ఎప్పుడైతే అధ్యక్షుడు అయ్యారో అప్పటి నుంచి పార్టీ పరిస్థితి మారిపోయింది. ప్రభుత్వంపై కొట్లాటడంలో కానీ.. ప్రజా సమస్యలపై పోరాడటంలో కానీ.. అధికార పార్టీపై పంచ్ లు వేయడంలో అధికార పార్టీ నేతల్నీ కడిగేయడంలో ఆయనకు ఆయనే సాటి.


అయితే అనూహ్యంగా ఆయన్ను పదవి నుంచి తప్పించి కిషన్ రెడ్డి కి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది అధిష్ఠానం. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరోసారి బండి సంజయ్ ని అధ్యక్షుడు చేయాలని పార్టీ భావిస్తొందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఆయన వస్తేనే రాష్ట్రంలో కమలం పువ్వు వికసిస్తుందని. పార్టీ జవసత్వాలు వస్తావయని పార్టీ పెద్దలు భావిస్తున్నారంట. అందుకే అధ్యక్ష పదవి కోసం ఆయన పేరు పరిశీలనలో ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: