వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో మొదటి నుంచి కలిసి నడుస్తున్న నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు. తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను లు పార్టీ మారుతున్నట్లు ప్రకటించారు. ఆయన పార్టీ పరిస్థితిపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. బాలినేని జగన్ కోసం మొదట్లో రాజీనామా చేసిన నేత మాత్రమే కాదు.. జగన్ సమీప బంధువు కూడా. ఆయన కూడా వైసీపీ అధినేతతో కలిసి నడిచేందుకు ఆసక్తి చూపడం లేదు.
ఒక్క దారుణం పరాజయం తర్వాత వైసీపీ ఫేట్ ఒక్కసారిగా మారిపోయింది. అతి భారీ మెజార్టీలతో ఓడిపోవడంతో భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న గందరగోళంతో పాటు జగన్ వ్యవహారశైలి వల్ల ఇబ్బంది పడిన వారంతా.. మెల్లగా వేరే దారి చూసుకుంటున్నారు. నిజాకిని ఇంకా ఎన్డీయే కూటమిలోని పార్టీలు ఆపరేషన్ ఆకర్ష్ వంటి కార్యక్రమాలు చేపట్టలేదు. వైసీపీలో ఉక్కపోత భరించలేని వారంతా భవిష్యత్తుపై భయంతో ముందుగానే సర్దుకొని వారి దారి వారు చూసుకుంటున్నారు.
బాలినేని శ్రీనివాస రెడ్డి ఓటమి తర్వాత కూడా వైసీపీ పాలసీ అయిన ఈవీఎంలపై వ్యతిరేకంగా పోరాడారు. కోర్టుల్లో కేసులు కూడా వేశారు. అయితే గుర్తించడానికి.. గుర్తింపు ఇవ్వడానికి జగన్ సిద్ధపడటం లేదు. చివరకు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది. ఇదే సమయంలో జగన్ పార్టీ పెట్టిన కొత్తలో చాలా మంది కాంగ్రెస్ నేతలు అధికార పార్టీకి రాజీనామా చేసి మరీ జగన్ తో కలిసి నడిచారు. ఇప్పుడు జగన్ వారందరినీ దూరం పెడుతున్నట్లు చెబుతున్నారు.
పైగా జగన్ పోయే వారి గురించి పోతే పోనివ్వండి.. కొత్త రక్తం వస్తుంది. నాయకులు ప్రజల నుంచి పుడతారు అంటూ లైట్ తీసుకొని మాట్లాడుతున్నారు. ప్రస్తుతం జగన్ ప్రతిపక్షంలో అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత ప్రభుత్వ అవినీతి అంశంలో..ఇసుక మైనింగ్, మద్యం, వంటి అంశాల్లో కేసులు పెట్టేందుకు రెడీ అవుతుంది. ఇలాంటి సమయంలో జగన్ తనతో పాటు నడిచిన నేతల్ని వదిలిపెట్టడం ఆయనకే తీరని నష్టం చేకూరుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.