కేసీఆర్ రాజకీయ వారసత్వంతో కవిత రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా నిజమాబాద్ ఎంపీ గెలిచి అందరి దృష్టిని ఆకర్షించారు. గెలిచిన తర్వాత కూడా కేవలం ఒకే పార్లమెంట్ నియోజకవర్గానికి కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగానూ గుర్తింపు సాధించారు. చాలా సందర్భాల్లోను రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేశారు. అందుకే.. ఆమెకు రాష్ట్ర వ్యాప్తంగానూ అభిమానులు ఉన్నారు.
కట్ చేస్తే.. దిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్టు అయ్యారు. సుమారు 5 నెలల పాటు పైగా ఆమె జైలులోనే ఉండిపోయారు. దాంతో కవిత ఎప్పుడు జైలు నుంచి వస్తుందా అని అభిమానులంతా ఎదురు చూశారు. ఇటీవల ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. వచ్చి కూడా 20 రోజులపైనే అవుతోంది. కానీ.. ఇప్పటి వరకు ఆమె ప్రజాక్షేత్రంలోకి రాలేదు. కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. వచ్చీ రాగానే కేసీఆర్ ను కలుసుకున్న ఆఎమ.. కొన్ని రోజుల పాటు అక్కడే ఉండిపోయారు. అయితే ఇప్పుడు ఆమె అభిమానులంతా కవిత ఎప్పుడు ప్రజల్లోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టే పండుగ బతుకమ్మ. ఈ ఉత్సవాలు రాష్ట్రంలో మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఏటా కవిత తెలంగాణ జాగృతి పేరిట బతుకమ్మ ఉత్సవాలను జరుపుతుంటారు. కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుంఆ.. ఇతర దేశాల్లోను ఈ పండుగ వైభవాన్ని చాటుతుంటారు. ఈ రోజు బతుకమ్మ ఖ్యాతి ఖండాంతరాలు చేరిందంటే అది కవిత క్ఎడిట్ అనే అందరూ చెబుతూ ఉంటారు.
ఈ పండుగ వచ్చిందంటే ఎమ్మెల్సీ కవిత చేసే హడావుడి అంతా ఇంతా కాదు. వారం పాటు నిత్యం ఒక్క చోట బతుకమ్మలను స్వయంగా పేరుస్తూ వేడుకలను నిర్వహిస్తారు. నేటి తరానికి సంస్కృతి చాటుతూ పండుగలా జరుపుతారు. అయితే ఈ ఏడాది పండుగలో పాల్గొనకుంటే ప్రజల్లో నెగిటివ్ థింక్ వస్తుందనే కోణంలోను ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆమె రాజకీయ పునరాగమనానికి బతుకమ్మే సరైన వేదిక అని పలువురు పేర్కొంటున్నారు.