తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో వైసీపీ వ్యూహాత్మక తప్పిదం చేసినట్లు రాజకీయం మారుతోంది. టీటీడీ బోర్డు స్వంత్రంతగా ఉంటుంది. రోజూ వారీ వ్యవహారాలను బోర్డే చూసుకుంటుంది. అని స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పినా.. నెయ్యి కల్తీ వ్యవహారం అంతా గత ప్రభుత్వం తప్పే అన్నట్లుగా ఇతర పార్టీలన్నీ ప్రొజెక్ట్ చేశాయి. వైసీపీ దానిని తిప్పికొట్లలేకపోయింది.
తప్పు చేయలేదని ఆ పార్టీ నేతలు బలంగా వాదించలేకపోతున్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మాత్రం అంటున్నారు. ఈ వ్యవహారంతో రాజకీయాలు వేడెక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా రోడ్డెక్కి ధర్నాలు చేయడం లేదు కానీ.. ఉత్తరాధిలో మాత్రం జగన్ కు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయి. హిందుత్వ రాజకీయాలు దక్షిణాదిలో కన్నా ఉత్తరాదిన ఎక్కువగా ఉంటాయి. తిరుమల అనేది ఉత్తారాది హిందు భక్తులకు కూడా అత్యంత పవిత్ర మైన ప్రదేశం. అలాంటి హిందూ ఆలయంలో.. అపచారం జరిగిందని తెలిసిన భారతీయ జనతా పార్టీ నేతలు ఘాటుగా స్పందించారు.
సహజంగానే హిందూత్వ వాదులు రంగంలోకి దిగారు. యూపీ, మధ్య ప్రదేశ్ వంటి చోట్ల నిరసనలు జరిగాయి. ఈ వ్యవహారంలో దేశ వ్యాప్తంగా జగన్ ఇమేజ్ హిందూ వ్యతిరేకంగా మారిపోయింది. అదే సమయంలో జగన్ క్రిస్టియానిటీ, ఆయన కుటుంబ నేపథ్యం ఏపీలో గత ఐదేళ్లలో జరిగిన మత మార్పిళ్లు ఇలా ప్రతి అంశాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తూ ట్రోల్ చేస్తున్నారు.
తాజా పరిణామాలతో జగన్ పై దేశ వ్యాప్తంగా హిందూ వ్యతిరేకి అనే ముద్ర పడింది. ఇప్పడు ఆయన దిల్లీలో ఏదైనా మద్దతు కోసం రాజకీయ పార్టీల వద్దకు వెళ్తే పాటికి పది సార్లు ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఇక లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా లడ్డూ వివాదంపై స్పందించారు. ఆయన స్పందన ప్రకారం చూస్తే.. జగన్ పై వస్తున్న వ్యతిరేకత వల్ల కాంగ్రెస్ కూటమివైపు జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడల్లా వెళ్లడం కష్టమే. బీజేపీతో సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో జగన్ జాతీయ రాజకీయాల్లో ఒంటరి అయ్యారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.