నిన్నటి దాకా విజయవాడలో ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన, ఇప్పుడు శ్రీవారి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వులు కలిపారనే ఘటన ఏపీ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఈ రెండు ఘటనలో వేళ్లన్నీ వైసీపీ వైపే చూపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ బెంగళూరుకు వెళ్లిపోయారు. గత ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఒకే ఒక్కసారి బెంగళూరు వెళ్లారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.


ఇప్పుడు అధికారం కోల్పోయాక ఈ వంద రోజుల్లో ఆయన తన సతీమణి భారతితో కలిసి పదో సారి బెంగళూరు వెళ్లారని చెబుతున్నారు. ఎన్నికల్లో ఓడిన దగ్గర నుంచి దాదాపు ప్రతి వారం కుటుంబ సమేతంగా జగన్ బెంగళూరులోని తన నివాసానికి వెళ్లున్నారనే టాక్ నడుస్తోంది. మళ్లీ వారం ప్రారంభంలో తాడేపల్లికి వస్తున్నారని గుర్తు చేస్తున్నారు. మళ్లీ వారాంతంలో సతీమణితో సహా జగన్ బెంగళూరు నివాసానికి తరలి పోతున్నారని గుర్తు చేస్తున్నారు.


ఈ నేపథ్యంలో వంద రోజుల్లోనే జగన్ పదో సారి బెంగళూరుకు వెళ్లడం వెనుక ఆసక్తికర చర్చ నడుస్తోంది. వాస్తవానికి జగన్ కు హైదరాబాద్ లోటస్ పాండ్ లోను నివాసం ఉంది. అయితే అక్కడ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ, ఆమె తల్లి విజయమ్మ నివాసం ఉంటున్నారు. లోసట్ పాండ్ నివాసంలో ఇద్దరికీ సమాన వాటాలున్నాయని సమాచారం.


ఇక తెలంగాణలో సీఎంగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆయనపై గతంలో జగన్ పలు ఆరోపణలు చేశారు. ఇదిలా ఉండగా కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఇండియా కూటమికి దగ్గర అవ్వడానికి జగన్ బెంగళూరు ను ఎంచుకున్నట్లు చెబుతున్నారు. పైగా డీకే శివకుమార్ వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఈయన ద్వారా జగన్ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. అందుకే జగన్ హైదరాబాద్ కంటే బెంగళూరు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారని చెబుతున్నారు. ఈ ఐదేళ్లు ఇలా బెంగళూరుకు, విజయవాడకు షటిల్ సర్వీస్ చేస్తారనే టాక్ కూడా నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: