ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అన్న సినిమా డైలాగ్ ఎంత పాపులర్ అన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏపీ మంత్రి నారా లోకేశ్.. తనను తాను తగ్గించుకున్న వైనం.. ఎక్కువ ఫోకస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైనం చూస్తే.. లోకేశ్ మైండ్ సెట్ ముచ్చట వేస్తుందని చెప్పాలి.


ఏపీ సీఎం కుమారుడిగా చంద్రబాబు కుమారుడిగా.. టీడీపీలో ఆయన స్థానం ఏ పాటిదన్న విషయాన్ని ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్న వేళ.. కిందా మీదా పడుతూ పాదయాత్రను పూర్తి చేయడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పడిన కష్టం… శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. చేతిలో అధికారం లేక.. అడుగడుగునా ఇబ్బందులు పెడుతున్నప్పటకీ విసుగు చెందిన తీరు లోకేశ్ లో కొట్టొచ్చినట్లు కనిపించేది.  అంతే కాదు..


ప్రతికూల వాతావరణంలో ప్రతి ఇష్యూలోనూ తానే ఉన్పప్పటికీ తన పేరు కోసం తపించిన వైనం లోకేశ్ అంతకంతకూ ఎక్కువ అవుతున్న పరిస్థితి. పార్టీ అధికారంలోకి రావడం.. పార్టీకి మిత్రులుగా ఒ వైపు బీజేపీ మరోవైపు జనసేన ఉన్పప్పుడు తన ఎదుగుదల మీద తనకు పెరగాల్సిన గౌరవ మర్యాదల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా అందరిలో ఒకడిగా ఉండటం అంత తేలికైన విషయం కాదు.


డిఫ్యాక్టో సీఎంగా వ్యవహరించారన్న పేరు కేటీఆర్ కు ఉంది. ఆ లెక్కన చూస్తే ఈ రోజున లోకేశ్ ఇమేజ్ మీద మరిన్ని ప్రాజెక్టులు చేయాల్సి ఉండేది. కానీ అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా తాను చేయాల్సిన పనిని మాత్రం చేసుకుంటూ పోతున్నారు. పని చేయడమే తప్పించి ఫలితం గురించి ఆలోచించకూడదన్నట్లు లోకేశ్ తీరు ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఏమైనా అధికారంలో మునిగి తేలుతూ కూడా.. అంతా తానై అన్నట్లు కనిపించాలన్న తపన లేకపోవడం ఒక ఎత్తు అయితే అలాంటి భావన ప్రజల్లోను లేకపోవడం కచ్చితంగా లోకేశ్ విజయంగా చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: