తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తోంది. ఈ విషయంపై కేంద్ర మంత్రులు ఘాటుగా స్పందిస్తున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఇప్పటికే దీనిపై విచారణకి ఆదేశించి పలు చర్యలు చేపడుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దీని కోసం నేటి నుంచి 11 రోజుల ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు.


హిందుత్వ అజెండాతో పని చేసే బీజేపీ ఇటువంటి అస్త్రం దొరికితే ప్రత్యర్థులపై చెలరేగిపోతుంది. అయితే ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో బీజేపీ నేతలకు అసలు ఈ విషయం తెలియనట్లు మౌనంగా ఉండిపోవడం ఆలోచింపచేస్తోంది. ఈ కోణంలో ఆలోచిస్తే కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. బీజేపీ అధిష్ఠానానికి నేటికి జగన్ పట్ల ఎక్కడో మమకారం ఉండటం వల్లే రాష్ట్ర బీజేపీ నేతలు ఈ అంశంపై మాట్లాడకుండా కట్టడి చేస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


రాష్ట్రంలో ఎప్పటికి అయినా జనసేనతో కలిసి అధికారంలోకి రావాలనే ఆలోచన ఉన్నందునే ఇప్పుడు బీజేపీ వెనక్కి తగ్గి.. పవన్ కల్యాణ్ లీడ్ తీసుకునేందుకు ప్రోత్సహించిందా?  నాడు చంద్రబాబుని జగన్ అరెస్టు చేసి జైల్లో పెడితే మౌనంగా ఉండిపోయిన బీజేపీ ఆయన నిర్ణయానికి సమర్థించినట్లే అయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు చంద్రబాబు జగన్ ని దెబ్బతీస్తుంటే కూడా మౌనంగా ఉంటుంది.



చంద్రబాబు నాయుడి కే మద్దతు ఇచ్చినట్లు ఉంటోంది. చంద్రబాబు, పవర్ కల్యాణ్ పరస్పరం దెబ్బ తీసుకొని బలహీన పడితే బీజేపీకి మేలు జరుగుతుందని ఎదురు చూస్తోందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా మత పరమైన అంశాలు ఎక్కడ జరిగినా.. ఛాన్స్ తీసుకునే బీజేపీ.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయిన తిరుపతి లడ్డూ ప్రసాదం విషయంలో సైలెంట్ గా ఉండటం మాత్రం వ్యూహాత్మకం అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  లేక ప్రసాదం విషయంలో పూర్తి స్పష్టత వచ్చాకే దీని గురించి మాట్లాడదాం అనుకుంటుందా అనేది కూడా అర్థం కావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: