మనదేశంలో సామాన్యులపై, మధ్య తరగతి వారిపై చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కానీ పెద్దల వ్యవహారాల్లో మాత్రం నిశ్శబ్దంగా మారుతుంది. ఏదో ఉరుము ఉరిమినట్లు.. పిడుగు పడినట్లు,, అప్పుడప్పుడు న్యాయస్థానం స్పదింస్తుంది. కానీ.. అప్పటికప్పుడే పెద్దలు సర్దేసుకుంటారు. చర్యలు తీసుకునేలోపు దేశం దాటి వెళ్లిపోతారు.


ఇలాంటి ఉదంతాలు మన దేశంలో చాలా జరిగాయి. అయినా సామాన్యులు, మధ్యతరగతి వారు ప్రజాస్వామ్యాన్ని నమ్ముతుంటారు. న్యాయస్థానాల పట్ల గౌరవాన్ని ప్రదర్శిస్తారు. అంత నమ్మకాన్ని కలిగి ఉన్న వారి విషయంలో న్యాయం అనేది చివరకు ఎండమావే. ఎన్నికలు లేకపోయినా తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్ గానే కొనసాగుతున్నాయి. అధికారం పోయిందనే బాధ భారత రాష్ట్ర సమితిలో ఉంది. అధికారం దక్కిందనే ఆనందం కాంగ్రెస్ పార్టీలో ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ వేసే ప్రతి అడుగును బీఆర్ఎస్ నిశితంగా పరిశీలిస్తోంది.


బీఆర్ఎస్ చేసే ప్రతి విమర్శకు అధికార పార్టీ గట్టిగానే కౌంటర్ ఇస్తుంది. అమెరికాలో సీఎం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం కుదుర్చుకున్నపెట్టుబడుల దగ్గర నుంచి మొదలు పెడితే.. అమృత్ పథకం వరకు ప్రతి విషయాన్ని బీఆర్ఎస్ తెరపైకి తెస్తుంది. వీటికి కాంగ్రెస్ పార్టీకి గట్టిగానే కౌంటర్ ఇస్తుంది.


ఈసారి అమృత్ పథకంలో రూ.8888 కోట్ల అక్రమాలు జరిగాయని. కేటీఆర్ ఆరోపించారు. దీనికి కౌంటర్ గా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు. ఒకవేళ కేటీఆర్ అన్నట్లు అక్రమాలు జరిగితే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. దీనికి దీటుగా సమాధానం ఇచ్చిన కేటీఆర్ ఒక వేళ అక్రమాలు జరగలేదని నిరూపస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు.


పేరొందిన రాజకీయ నాయకులు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోవడంతో తెలంగాణలో చర్చ మొదలైంది. అయితే.. వీరిద్దరూ  రాజీనామా చేస్తారా? రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అంటే కచ్ఛితంగా కాదు అని విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ నాయకులు సవాళ్ల మీద ఎప్పుడూ నిలబడరు. అప్పటికప్పుడు ఏవేవో కామెంట్లు చేస్తారు తప్ప వేరేది ఏమీ ఉండదు.


అవినీతిని కేటీఆర్ నిరూపించలేరు. వాటిని రేవంత్ రెడ్డి రద్దు చేయరు. కాని మీడియాలో మాత్రం పెద్ద పెద్ద హెడ్డింగులతో పతాక శీర్షికలు, న్యూస్ ఛానళ్లకు వార్తలు లభిస్తాయి అంతే.

మరింత సమాచారం తెలుసుకోండి: