తిరుమల లడ్డూ వివాదం యావత్ ప్రపంచాన్ని ఊపేస్తోంది. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఈ వ్యవహారం నడిచింది. దీనిపై తప్పు మీది అంటే మీది అంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వైసీపీ హయాంలోనే ఈ కల్తీ వ్యవహారం నడిచిందన్న ఆరోపణలు వచ్చాయి.


దీనిపై వైసీపీ కూడా స్ర్టాంగ్ గా రియాక్ట్ అయింది. అప్పట్లో టీటీడీ ఛైర్మన్ గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి,  భూమన కరుణాకర్ రెడ్డిలు స్పందించారు. ఈ ఘటనను ఖండించారు. మాజీ సీఎం జగన్ సైతం ఇది చంద్రబాబు ఆడిన డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ఇంకో వైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే దీనిని బయట పెట్టింది చంద్రబాబు. అంతకు మంచి రియాక్ట్ అయింది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఈ ఘటనను నిరసిస్తూ.. ప్రాయశ్చిత్త దీక్షకు కూడా ఆయన దిగారు.


పవన్ కామెంట్లు సైతం వైరల్ గా మారాయి. వైసీపీ ప్రభుత్వమే అప్పట్లో అలా వ్యవహరించిందన్న ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ కేంద్రానికి లేఖ రాశారు. జరిగిన ఘటనపై వివరణ ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఏపీలో డైవర్షన్ పాలిటిక్స్ పతాక స్థాయికి జరిగిందని కేంద్రం దృష్టికి తీసుకొచ్చారు. సరిగ్గా ఇదే సయమంలో పవన్ యూ టర్న్ తీసుకోవడం విశేషం.


తాజాగా పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము జగన్ ని తప్పు పట్టడం లేదని ప్రకటించారు. అప్పటి టీటీడీ బోర్డు ఈ విధంగా వ్యవహరించి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ట్రస్ట్ బోర్డుపై ఉందని..అందులో వైఫల్యం  చెందినందు వల్లే తాము ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. కేవలం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, ఈవోలు ఏం చేస్తున్నారని ప్రశ్నించామని చెప్పుకొచ్చారు. అప్పట్లో శ్రీవాణి ట్రస్ట్ పేరుతో భారీగా అవినీతి జరిగిందని ఆరోపించారు. అయితే జగన్ క్లీన్ చిట్ ఇవ్వడం ఏమిటనే ప్రశ్న తాజాగా ఉత్పన్నం అవుతుంది. కేవలం జగన్ కేంద్రానికి లేఖ రాశారని.. కేంద్ర పెద్దల సూచనలతోనే పవన్ వెనక్కి తగ్గారనే ప్రచారం ప్రారంభం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: