తన ద్వారా జరిగిన ప్రమాదంపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఎక్స్ వేదికగా దీనికి సంబంధించి క్షమాపణలు సైతం ఆయన కోరారు. నారా లోకేశ్ ప్రస్తుతం విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నారా లోకేశ్ కాన్వాయ్ లోని ఓ కారు ఢీ కొనడంతో కల్యాణ్ భరద్వాజ్ అనే వ్యక్తి కారు డ్యామేజ్ అయ్యింది.
ఈ విషయాన్ని తెలియజేస్తూ.. స్వయంగా బాధితుడు కల్యాణ్ భరద్వాజ్ ఎక్స్ లో ఓ పోస్టు పెట్టారు. ఈ పోస్టుని నారా లోకేశ్ కు ట్యాగ్ చేశారు. నారా లోకేశ్ గారు.. నేనే మీ పరిపాలనను మరియు టీడీపీని చాలా ప్రేమిస్తున్నాను. మిమ్మల్ని తిరిగి ఆదేశానికి తెచ్చినందుకు గర్విస్తున్నాను. కానీ ఈ రోజు విశాఖపట్నం హైవే దగ్గర తాటిచెట్ల పాలెం దగ్గర మేము మీ కాన్వాయ్ వెళ్లేందుకు స్టాటిక్ మోడ్ లో రోడ్డు ఉండగా మీ కాన్వాయ్ నన్ను ఢీకొట్టింది. మీ కారు ఒక్కటి మమ్మల్ని భరద్వాజ్ తన పోస్టులో తెలిపారు. అంతే కాకుండా కారు డ్యామేజీ అయిన ఫొటోలను సైతం తన పోస్టు జత చేశారు.
కల్యాణ్ భరద్వాజ్ చేసిన పోస్టుకు మంత్రి నారా లోకేశ్ స్పందించారు. దయచేసి నా హృదయ పూర్వక క్షమాపణలను అంగీకరించండి నేను నా భద్రదతా బృందానికి తీవ్ర జాగ్రత్తలు తీసుకోవాలని మరియు అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆదేశిస్తాను. నా బృందం మమ్మల్ని సంప్రదిస్తుంది మరియు డెంట్ ను సరిచేయడానికి అయ్యే ఖర్చులను భరిస్తుంది అంటూ రిప్లై ఇచ్చారు. లోకేశ్ పోస్టుకి భరద్వాజ్ తిరిగి రిప్లై ఇచ్చారు.
తన కాంటాక్ట్ నంబరు అంటూ ఒక ఫోన్ నంబరును పేర్కొన్నారు. అలాగే లోకేశ్ స్పందనకు కృతజ్ఙతలు తెలిపారు. ఈ ఘటనపై టీడీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు లోకేశ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. నాయకత్వ లక్షణాలను చూపించారంటూ పొగడ్తల వర్షంలో కురిపిస్తున్నారు. నాయకుడి లక్షణం ఇలాగే ఉండాలని తప్పు జరిగితే తప్పు జరిగిందని.. ఒప్పుకోవడమే కాకుండా క్షమాపణలు చెప్పడం గ్రేట్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.