అది 2006 సంవత్సరం. హెజ్ బోల్లా  ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమయంలో హెజ్ బోల్లా సంస్థ కొన్ని వేల రాకెట్లను టెల్ అవీవ్ పై ప్రయోగించింది. దీంతో.. అక్కడ భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఈ సమయంలో ఇకపై తమ దేశంపై శత్రు దేశాల రాకెట్లు పడకూడదని..ఫిక్సయింది ఐరన్ డోమ్ తయారికి నిర్ణయించింది.


అవును.. 2006లో హెజ్ బోల్లా  దాడుల్లో భారీ ప్రాణనష్టం చవిచూసిన తర్వాత ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తయారీకి నిర్ణయించింది. అనుకున్నది డవుగా అమెరికా సాయంతో పని మొదలు పెట్టింది. 2008 నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. ఫైనల్ గా 2011లో పూర్తి స్థాయి డోమన్ ను అందుబాటులోకి తెచ్చింది.


దీని సక్సెస్ రేట్ 90శాతానికి పైగానే ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఎయిర్ ఢిపెన్స్ వ్యవస్థల్లో ఇదో అద్భుతం అనే చెప్పాలి. గత ఏడాది అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత వేల రాకెట్లను కూల్చి వేసింది. అయితే ఈ ఐరన్ డోమ్ ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి అయ్యే ఖర్చు సుమారు 50వేల డాలర్లు అవుతుందని అంచనా.


శత్రు రాకెట్లు దేశంపై దూసుకొస్తున్న సమయంలో.. ఒక్కో రాకెట్ ను పేల్చడానికి ఇది రెండు క్షిపణులను ప్రయోగిస్తుంది. వాస్తవానికి ఇజ్రాయెల్ డిఫెన్స్ వ్యవస్థ వివిధ దశల్లొ పనిచేస్తుంది. యూరో-2, యూరో-3 సిస్టంలు బాలిస్టిక్ క్షిపణలును అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఇవి అంతరిక్షంలోనే వాటిని పేల్చేస్తాయి. అనంరతం డేవింగ్ స్లింగ్ మధ్య శ్రేణి వ్యవస్థగా పనిచేస్తుంది. దీన్ని 100 నుంచి 200 కి.మీ. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి వాడతారు. ఇదే సమయంలో యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చడానికి దీని పాత్ర కీలకంగా ఉంటుంది. ఇక చిట్టచివరి దశలో డోమ్ ఉంటుంది.  వీటిలో దూసుకొచ్చే ముప్పును ముందుగానే కనిపెట్టి. ఎక్కడ తాకుతుందో అంచనా వేసి వాటిని కూల్చేస్తుంది. అందుకే శత్రువులు వేల రాకెట్లను నిప్పుల వర్షంలా కురిపిస్తున్నా.. వీటిని తట్టుకొని ఇజ్రాయెల్ బలంగా తిప్పికొడుతూ పోరాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: