పెళ్లి అనే భావన మారిపోతుంది. ఒకప్పుడు పెళ్లి అంటే పవిత్ర బంధం. ఒక్కసారి పెళ్లయితే చావు వరకు కలిసి ఉండాలి. కానీ కాలక్రమేణా పెళ్లిళ్లతో పాటు విడాకులు కూడా పెరిగిపోతున్నాయి. చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. అక్రమ సంబంధాలు, లివ్ ఇన్ రిలేషన్స్, డేటింగ్, భార్యల మార్పిడి.. ఇలాంటివి ఒకప్పుడు విదేశాలకే పరిమితం అయ్యేవి. కానీ..ఇప్పుడు మన దేశంలోను సర్వసాధారణం అయిపోయాయి.
దీనివల్ల మహిళలు స్వతంత్రంగా బతకాడానికి ఇష్టపడుతున్నారు. పెళ్లి బంధంలో ఇరుక్కోవడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారు. దీనివల్ల ఇంకో 60-70 ఏళ్లలో అంటే 2100 నాటికి పెళ్లి అనే వ్యవస్థ ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. పెళ్లిళ్లు చేసుకోరనే ఆందోళనకర విషయాన్ని వారు వెల్లడిస్తున్నారు. ఈ మేరకు నిపుణులు విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అయింది.
పెళ్లి వంటి బంధాలు ఎలా మారుతున్నాయి. సామాజిక మార్పులు, పెరిగిపోతున్న వ్యక్తిగత స్వేచ్ఛ, మారుతున్న లింగ సమానత్వం వల్ల సంప్రదాయ పెళ్లిళ్లు ఎలా అంతరించిపోతున్నాయో ఈ వీడియోలో వివరించారు. ప్రస్తుతం యువతరం కెరీర్, వ్యక్తిగత అభివృద్ధి, అనుభవాలను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, లివ్ ఇన్ రిలేషన్స్ ఇతర సంబంధాలు పెరిగిపోతున్నాయి. దీనివల్ల పెళ్లి అవసరం లేకుండా పోతుందని నిపుణులు అంటున్నారు.
టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి రావడం వల్ల భవిష్యత్తులో మానవ సంబంధాలు మరింతగా మారిపోతాయని, జీవన వ్యయం పెరిగిపోవడం వల్ల కూడా ప్రజల పెళ్లి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని.. ముఖ్యంగా మహిళలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నారని, పెళ్లి బంధంలో ఇరుక్కోవడం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పెళ్లి అంటే బంధనం, స్వేచ్ఛ ఉండదు, భవిష్యత్తు ఉండదు, కెరీర్ ఉండదు అనే భావనతో చాలా మంది ఉన్నారు. దీంతో వీరు వివాహం చేసుకోవడానికి ముందుకొచ్చే పరిస్థితి లేదని.. పెళ్లయినా పిల్లల్ని కనడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే 2100 నాటికి పెళ్లి అనేది ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా 800 కోట్లు ఉండగా.. రానున్న రోజుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 2021 నాటికి అది 2.23 శాతానికి పడిపోయింది. 2100 నాటికి అది 1.59 శాతానికి పడిపోతుందని అంచనా.